యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు దాదాపు మూడు వారాల క్రితం ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ కు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం కావడంతో అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని మరీ ఆ చోట్లకు వెళ్లి తన కోరిక తీర్చుకుంటున్నాడు.
తాజాగా భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి న్యూయార్క్ నగర వీధుల్లో సందడి చేసాడు. ఒకవైపు నగరంలోని పలు ప్రాంతాలను చుట్టేస్తూనే మరోవైపు భార్యతో కలిసి షాపింగ్ కూడా చేస్తున్నాడు. ఇక మహిళలకు షాపింగ్ అంటే మహా సరదా అనే విషయం తెలిసిందే. దాంతో లక్ష్మీ ప్రణతిని అన్ని షాప్ లకు తీసుకెళుతూ ఆమెని సంతోష పెడుతున్నాడు.
ఇప్పట్లో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేదు. సంక్రాంతి ముందు మాత్రమే ఇండియాకు రానున్నాడు ఎన్టీఆర్.న్యూ ఇయర్ వేడుకలు అమెరికాలోనే జరుపుకోనున్నారు. సంక్రాంతి ముందు ఇండియాకు రానున్నాడు. వచ్చాక కొరటాల శివ సినిమా పట్టాలెక్కించనున్నాడు. అప్పటి వరకు ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటారన్న మాట. షూటింగ్ లు మళ్ళీ మొదలైతే ఇలా షాపింగ్ లకు , షికారులకు తీసుకెళ్లడం కుదరదు కదా ! అందుకే అన్నమాట.