
రాయలసీమ భామ ప్రియాంకా జవాల్కర్ తాజాగా గుర్రమెక్కి హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది. గుర్రం పై గజ్జెల గుర్రం అన్నట్లుగా ఉంది ఈ భామ ఫోజులు చూస్తుంటే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ” టాక్సీ వాలా ” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి ఈ ప్రియాంకా జవాల్కర్. టాక్సీ వాలా మంచి హిట్ అయినప్పటికీ ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దానికి తోడు ఇతర అనారోగ్య సమస్యలతో పాపం సతమతమయ్యింది.
రెండేళ్ల పాటు చికిత్స పొందిన ఈ భామ తాజాగా స్పీడ్ పెంచింది. ఇటీవలే ఈ భామ నటించిన తిమ్మరుసు చిత్రం రిలీజ్ కాగా ఎస్సార్ కల్యాణ మండపం అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది. దానికి తోడు ఆ సినిమాలో ప్రియాంక నటనకు , గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలన్న చందంగా అందాల ఆరబోతతో కుర్రాళ్ళని హెట్టెక్కి పోయేలా చేస్తోంది.
గుర్రం పైకి ఎక్కి ఫోటోలకు ఫోజిచ్చిన ఈ భామ వాటిని మీడియాకు వదిలింది. నేను గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం అంటూ హింట్ ఇస్తోంది. అల్లు అర్జున్ అంటే పిచ్చి అంటున్న ఈ భామ స్టార్ హీరోలు అందరు కూడా ఇష్టమే కాకపోతే అల్లు అర్జున్ అంటే ఇంకా పిచ్చి అని అంటోంది. మరి అల్లు అర్జున్ ఈ భామకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. అందాల ఆరబోతలో నార్త్ భామలకు ఏమాత్రం తీసిపోనని ఇలా చెప్పకనే చెబుతోంది. కాబట్టి దర్శక నిర్మాతలు ఆలోచించండి.