35.7 C
India
Friday, May 15, 2026
More

    డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి వ‌స్తున్న‌ ‘సుందరాంగుడు’

    Date:

    Sundarangudu hitting the theaters on December 17
    Sundarangudu hitting the theaters on December 17

    తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎం ఏస్. కె ప్రమిద ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్‌ గౌడ్, యం.యస్‌.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ సినిమా హైలైట్స్ తెలిపింది.

    కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు.

    ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. డిసెంబర్ 17 విడుదల అవుతున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.

    జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి
    ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్
    మ్యూజిక్: సిద్ధబాబు
    కొరియోగ్రాఫర్ : నిక్సన్ పాల్ ,సూర్య కిరణ్ ,అనీష్ ,రవి కృష్ణ
    కెమెరా: వెంకట్ హనుమాన్
    ఎడిటింగ్: నందమూరి హరి
    నిర్మాతలు: బీసు చందర్ గౌడ్‌ – MSK రాజు
    దర్శకత్వం: వినయ్ బాబు.
    పి.ఆర్‌.ఓ : దయ్యాల అశోక్.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    శ్రీ శ్రీ శ్రీ బిరప్ప -కామరతి పుస్తక బ్రోచర్ ఆవిష్కరణ

    శ్రీ శ్రీ శ్రీ బిరప్ప స్వామి-కామరతి దేవి దివ్య చరిత్రను కురుమ...

    హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

    డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి 'సుందరాంగుడు’ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబ‌య్యాడు. లవ్...