37.8 C
India
Monday, April 29, 2024
More

    హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘సుందరాంగుడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

    Date:

    Sundarangudu' title song release by hero Srikanth
    Sundarangudu’ title song release by hero Srikanth

    డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి ‘సుందరాంగుడు’ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ‘సుందరాంగుడు’ ముస్తాబ‌య్యాడు. లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ‌ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్‌ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సుందరాంగుడు’ సినిమాలోని ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘ టైటిల్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

    ఈ సందర్భంగా ముఖ్య అతిథి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. హీరో కృష్ణసాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఎంతో ఇష్టంతో సుందరాంగుడు సినిమాలో నటించారు. సినిమా రష్ చూశాను చాలా క్వాలిటిగా తీశారు. నేను లాంచ్ చేసిన ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. డిసెంబర్ 17 న రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు..

    హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. మా సుందరాంగుడు ట్రైటిల్ సాంగ్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఙతలు. ఈ టైటిల్ సాంగ్ దర్శకులు వినయ్ బాబు రాశారు. రవికృష్ణ కోరియోగ్రఫిలో వచ్చిన ఈ సాంగ్ అందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి… ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అంద‌మైన‌ లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. సీనియర్ నటీనటులు జీవా, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి, బాషా, మైయిన్ విలన్ గా అమిత్ తివారి నటించారు. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాలో మరో హైలైట్ అన్నారు. అంతేకాకుండా ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. డిసెంబర్ 17 విడుదల అవుతున్న ‘సుందరాంగుడు’ అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తాడ‌ని అన్నారు.. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.

    ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ – మా సుందరాంగుడు సినిమా తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 17న రిలీజ్ అవుతుంది.. హీరో కృష్ణ సాయి కొత్తవారైన ఎటువంటి డూప్ లేకుండా ఫైట్స్ చేశారు.. మా సినిమాను అందరూ ఆదరించాలి. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ రవికృష్ణ, పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు…

    జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి….
    ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్
    మ్యూజిక్: సిద్ధబాబు
    కొరియోగ్రాఫర్: నిక్సన్, పాల్, సూర్య కిరణ్, అనీష్, రవి కృష్ణ
    కెమెరా: వెంకట్ హనుమాన్
    ఎడిటింగ్: నందమూరి హరి
    నిర్మాతలు: బీసు చందర్ గౌడ్‌ – MSK రాజు
    కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం: వినయ్ బాబు
    పీ.ఆర్‌.ఓ : దయ్యాల అశోక్.

    Share post:

    More like this
    Related

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    శ్రీ శ్రీ శ్రీ బిరప్ప -కామరతి పుస్తక బ్రోచర్ ఆవిష్కరణ

    శ్రీ శ్రీ శ్రీ బిరప్ప స్వామి-కామరతి దేవి దివ్య చరిత్రను కురుమ...

    డిసెంబర్ 17న థియేట‌ర్‌లోకి వ‌స్తున్న‌ ‘సుందరాంగుడు’

    తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్...