వీర సింహా రెడ్డి ట్రైలర్ ఇప్పుడే చూసా …….. రచ్చ రచ్చ జనవరి 6 న మంటలు మండటం ఖాయం …. జై బాలయ్య అంటూ ట్వీట్ చేసాడు సంగీత దర్శకుడు తమన్. వీర సింహా రెడ్డి చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అనే విషయం తెలిసిందే. ట్రైలర్ కట్ అయ్యింది. అయితే ఆ ట్రైలర్ మోత మోగాలంటే ఆ సన్నివేశాలకు తగిన ఆర్ ఆర్ జత చేయాలి. అంటే తమన్ నేపథ్య సంగీతం అందించాలి.
తమన్ తన పని తాను చేసాడట. ఈ ట్రైలర్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నాడు తమన్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రానికి కూడా తమన్ సంగీతం అందించాడు. బాలయ్య విశ్వరూపంకు తోడు తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్ లో నిలబెట్టింది.
ఇక ఇప్పుడు అదే పని వీర సింహా రెడ్డి చిత్రానికి కూడా చేసాడట తమన్. బాలయ్య డైలాగ్స్ కు తమన్ అందించే రీ రికార్డింగ్ థియేటర్ లో ఈలలతో గోలలతో దద్దరిల్లి పోవడం ఖాయం. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. వీర సింహా రెడ్డి జనవరి 12 న విడుదల అవుతుండగా దానికి ముందుగా జనవరి 6 న ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.