power star మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సృజనాత్మకత దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. దీంతో అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందరు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రాంచరణ్ తండ్రి కావడంతో సినిమా షూటింగులకు కాస్త విరామం ఇచ్చాడు. దీంతోనే సినిమాల నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుగుతుండటంతో త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాల నిర్మాణంలో సాంకేతికత బాగా ఉపయోగించుకునే శంకర్ సినిమాలు కాస్త ఆలస్యం అవుతాయి. అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమా అప్ డేట్స్ బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన విషయాలు తెలియడంతో ఇక సినిమా నిర్మాణంలో వేగం పెంచుతున్నారు. త్వరగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాపై కీలక అప్ డేట్స్ రావడంతో సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. జులై 10 లేదా 11 నుంచి సినిమా పున: ప్రారంభం కాబోతోంది. దీనికి శంకర్ ప్రణాళిక రచిస్తున్నారు. ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో తాజా సన్నివేశాలు పూర్తి చేసి సినిమా విడుదల చేయాలని చెబుతున్నారు.
శంకర్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా రాంచరణ్ కు మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చూస్తున్నారు. దీని కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో తాజా సన్నివేశాలతో చాలా వరకు సినిమా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దీంతో తొందరగా విడుదల చేసేందుకు శంకర్ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. గేమ్ చేంజర్ ఇద్దరికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.