31.9 C
India
Sunday, April 19, 2026
More

    యమా స్పీడ్‌ మీదున్న పవన్ .. మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్..!

    Date:

    Young director gets golden chance with pawan kalyan
    Young director gets golden chance with pawan kalyan

    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ దూకుడుమీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేరీర్ ప్రారంభం నుంచి ఏడాదికొక సినిమా చేసిన పవన్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సెట్స్ పై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… మరో రెండు సినిమాల షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. రీసెంట్ గా మరో సినిమాను పవన్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

    స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ తో పవన్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. రవితేజ నటించిన రావణాసుర ప్రమోషన్స్‌లో పాల్గొన్న సుధీర్‌వర్మ ఈ విషయాన్ని బయటపెట్టాడు. త్రివిక్రమ్ రెడీ చేసిన కథతో సినిమా రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ‘కేశవ’ చిత్రం సమయంలోనే త్రివిక్రమ్‌ ఓ లైన్‌ ఇచ్చి డెవలప్‌ చేయమన్నారని.. దానిపై వర్క్‌ జరుగుతోందని తెలిపారు. దీనికి మెయిన్‌ స్టోరీ త్రివిక్రమ్‌దేనని అయితే.. ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

    పవన్ కల్యాణ్ క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీష్‌ శంకర్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సీతమ్‌’ రీమేక్‌ చేస్తున్నాడు. వీటితో పాటు సుజీత్‌ దర్శకత్వంలో ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’చిత్రంతో చేస్తున్నాడు. రీసెంట్ గా మరో మూవీ కూడా లైన్ కి రావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏదైనా ఒక సినిమాను ఓకే చేశాడంటే దాదాపుగా మెరుపు వేగంతోనే కంప్లీట్ చేస్తుంటాడు. కథను లాక్ చేసి, కాల్షిట్లను పక్కాగా లెక్కేసుకుని మేకర్స్ కి ఇచ్చేస్తాడు. వారు కూడా వాటిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు. ఇప్పుడు సుధీర్‌వర్మ కూడా అదే ఫార్మూలాను ఫాలో అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే… ప్రజెంట్ పవన్ కల్యాణ్ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే… సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో పవన్ .. సుధీర్‌వర్మ తన మూవీలో ఎలా చూపించబోతున్నాడన్న క్యూరియాసిటి అప్పుడే నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...