25 C
India
Friday, June 28, 2024
More

    Industry Hit : 12మంది రిజెక్ట్ చేసిన కథ.. చివరికి ఇండస్ట్రీ హిట్టు!

    Date:

    Suriya- bala movie shelved
    Suriya- bala movie shelved

    Industry Hit : సాధారణంగా దర్శకుడు కథ రాసేప్పుడు ఒక హీరోను ఊహించుకొని రాస్తాడు. లేదా.. రచయిత వద్ద కథ ఉన్నా.. ఫలానా హీరో అయితే ఈ కథను బాగా సూట్ అవుతాడని చెప్తాడు. వెంటనే ఆ స్టోరీని హీరోకు చెప్తాడు. ఆయన కనుక రిజక్ట్ చేస్తే మరో హీరోను వెతుక్కోవాల్సి వస్తుంది.

    ఇలాగే ఒక దర్శకుడికి జరిగింది. కానీ ఒక్క హీరో కాదంటే ఇంకో హీరోకు ఆ కథ దక్కలేదు. ఒకరిద్దరు హీరోలు రిజక్ట్ చేయడంతో ఆయన ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు. లిస్ట్ లో ఉన్న 12 మంది వద్దకు వెళ్లాడు.. వారంతా తాము ఈ కథ చేయం అన్నారట. దీంతో తను రాసుకున్న కథపై ప్రేమను చంపుకోలేక మరో హీరోను కలిశారట. ఆయన ఒకే అనడంతో ఆయనతో సినిమా చేశారు.

    13వ హీరోతో సినిమా తీసి బంపర్ హిట్టు కొట్టాడు. అదే ‘గజనీ’ సినిమా. సూర్య హీరోగా ఈ సినిమా 2005లో రిలీజై తమిళనాట హిట్టుగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తే.. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ సినిమాతోనే సూర్యకు తెలుగునాట పాపులారిటీ వచ్చింది.

    ఈ మూవీ కథను సూర్య కంటే ముందు 12 మందికి చెప్పినట్లు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఒక సందర్భంలో చెప్పారు. మురుగుదాస్ గజనీని తెలుగు హీరోల‌తో చేయాలనుకున్నాడట. అనుకున్నదే తడువుగా మహేశ్ బాబు వద్దకు వెళ్లి ఈ క‌థ‌ను చెప్పాడ‌ట‌.

    ఒంటి నిండా ప‌చ్చ బోట్టు అనే కాన్సెప్ట్ మహేశ్ బాబుకు నచ్చలేదట. ఆ త‌ర్వాత పవన్ కళ్యాణ్‌ కూడా ఇదే కారణంగా చూపుతూ వద్దన్నాడట. దీంతో మురుగుదాస్ తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండాలని అభయ్ లాంటి సినిమా చేసిన కమల్ కు ఇది పర్ఫెక్ట్ అనుకున్నరట. అందుకు క‌థలో మార్పులు చేసి క‌మ‌ల్‌కు చెప్పాడ‌ట‌ ఆయన కూడా నో అన్నారట.

    క‌మ‌ల్‌తో పాటు ర‌జినీ, విజ‌య్ కాంత్‌, దలపతి విజ‌య్ ఇలా 12 మంది హీరోల‌కు కథ చెప్పాడ‌ట‌. వీళ్లంతా రిజెక్ట్ చేయడంతో కథ నిజంగా బాగాలేదా అనుకొని పక్కన పెట్టేశాడట. తనకు లైఫ్ ఇచ్చిన అజిత్ కు ఒకసారి కథ చెప్పి చూస్తా అనుకున్నారట మురుగదాస్.

    అజిత్‌కు క‌థ న‌చ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట‌. ఇక వేగంగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు పూర్తి చేసుకొని సినిమా పట్టాలెక్కించాట. షూటింగ్ వేగంగా జరుగుతోంది. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. అనుకుంటున్న టైమ్‌లో నిర్మాత రూపంలో బ్రేకులు పడ్డాయి. అజిత్‌కు నిర్మాత‌కు మ‌ధ్య విభేదాలు రావడంతో అజిత్ సినిమా నుంచి తప్పుకున్నాడు.

    దీంతో మురుగదాస్ మరోసారి కుంగిపోయారట. అయినా ప్రాజెక్ట్ పై ప్రేమను మాత్రం చంపుకోలేదట. అప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న సూర్యను కలిసి ఒప్పించి కేవలం ఐదు నెలల్లో టాకీ పూర్తి చేసి.. మరో 2 నెలలు ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్‌ పనులు ముగించుకొని సెప్టెంబరు చివరలో రిలీజ్ చేశారు.

    ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను మూడేళ్ల తర్వాత బాలీవుడ్ లో అమీర్ ఖాన్‌తో చేసి మరో సారి భారీ హిట్టు కొట్టాడు మురుగదాస్. గజనీలో ముందుగా విలన్‌గా ప్రకాశ్ రాజ్‌, సెకండ్ హీరోయిన్‌గా శ్రీయను తీసుకున్నారట. కానీ వారు కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. వాళ్ల ప్లేస్‌లో నయనతార, ప్రదీప్ రావత్ వచ్చారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....