35.3 C
India
Wednesday, May 15, 2024
More

    వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం

    Date:

    Vivekananda accused in Chanchal Guda Jail
    Vivekananda
    సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు లో ఎర్ర గంగి రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. సీబీఐ ముందు మే 5 వరకూ లొంగిపోకుంటే, గంగిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ముందు మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్ట్ ఆదేశించింది..
    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి.
    సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేయడంలేదని గంగిరెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు గురువారనికి వాయిదా వేసింది.
     ఈరోజు హైకోర్టు తీర్పు వేలువరించింది.ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ సందర్బంగా సిట్ కౌంటర్ ని పరిగణలోకి తీసుకుంటున్నారని అసలు సిట్ సరిగా పని చెయ్యడం లేదని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని  గుర్తు చేశారు.. అది సరిగా పని చెయ్యక పోవడం వల్లే సీబీఐ దర్యాప్తు చేస్తుందన్నారు. సిట్ కౌంటర్ ను పరిగణలోకి తీసుకోవడం  సరికాదన్నారు..స్థానిక పోలీసులు కేసును ఏడాది పాటు ముందుకు తీసుకెళ్లాలేదన్నారు..
    వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బయట ఉండటం సమంజసం కాదని, సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే సాక్ష్యులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే సాక్షాలను తారుమారు చేస్తున్నారని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఎర్రగంగిరెడ్డి ఎక్కడా కూడా సాక్ష్యులను ప్రభావితం చేయలేదని ఎర్రగంగిరెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఎర్రగంగిరెడ్డి బెయిల్ నిబంధనలు విస్మరించకుండా..  నడుచుకుంటున్నారని తెలిపారు.
    గతంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్‌‌ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. అయితే అప్పటికే వివేకా కేసు తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. ఈ మేరకు ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ… తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయడం  రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dastagiri Petition : జగన్ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించoడి : సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

    Dastagiri Petition : హైదరాబాద్: మాజీమంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్...

    CBI Investigation : తిరుపతి చంద్రగిరి – రైల్వే SSE, ADEE లంచం కేసులో సీబీఐ విచారణ

    CBI Investigation :  ఏపీ తిరుపతి:  రెండు రైల్వే జోన్‌లకు చెందిన ఇద్దరు...

    CM Revanth : ‘కాళేశ్వరం’లో అవినీతిపై రేవంత్ సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదు?

    CM Revanth : తెలంగాణ రాజకీయాలు గత కొద్దికాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు...

    Supreme Court: వివేకా కేసులో సీబీఐకి ట్విస్ట్ ఇచ్చిన న్యాయస్థానం

    supreme court ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసు...