37.8 C
India
Saturday, May 18, 2024
More

    CM of Karnataka : కర్ణాటక సీఎం ఎవరనేది ఇంకా సస్పెన్స్..!

    Date:

    • బెంగళూరులో తేలని పంచాయతీ
    • ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ రాజకీయం
    • నేడు అధిష్ఠానమే ప్రకటించే అవకాశం
    CM of Karnataka
    CM of Karnataka

    CM of Karnataka : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అందరి అంచనాలను మించి ఏకంగా 136 సీట్లను గెల్చుకోవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. అయితే ఇంకా సీఎం ఎవరనేది (CM of Karnataka) మాత్రం తేలలేదు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఇంకా ఆ పోటీ కొనసాగుతున్నది. అయితే అధిష్టానం వద్దకు ఈ పంచాయతీ చేరినట్లు సమాచారం.

    అరగంటలో ముగిసిన సీఎల్పీ..

    సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ భేటీ సగంలోనే ముగిసింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గీయుల పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అయితే పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం సీటు పంచాయతీ ఢిల్లీకి చేరింది. సోమవారం రాహుల్, సోనియా దీనిపై ఓ నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే రాహుల్, సోనియాను కలిసి చర్చించనట్లు సమాచారం. సోమవారం ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ లకు ఆహ్వానం అందినట్లుగా తెలుస్తున్నది. ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీపడుతున్నారని తెలిసింది.

    అయితే సీఎల్పీ మాత్రం హైకమాండ్ కే సీఎం అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఏకవాఖ్య తీర్మానం చేసినట్లుగా సమాచారం. అయితే ఇక సోమవారం హై కమాండ్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం ఏఐసీసీ స్వీకరించింది. ఇక అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి. మరోవైపు కాంగ్రెస్ లో పరిణామాలను బీజేపీ నిశీతంగా పరిశీలిస్తున్నది. ఈ వివాదాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Komatireddy Meets DK : నేడు డీకేను కలువనున్న కోమటిరెడ్డి.. అందుకే అంటూ కామెంట్లు!

    Komatireddy Meets DK : కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్...

    DK meet Sharmila : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో డీకే కీలక భేటీ..

    DK meet Sharmila : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్,...

    Rahul and Priyanka : కర్ణాటక చేరుకున్న రాహుల్, ప్రియాంక

    Rahul and Priyanka : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం...

    Karnataka new government : నేడు కర్ణాటకలో కీలక ఘట్టం.. కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

    Karnataka new government : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన...