
Komatireddy Meets DK : కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఊపుమీద ఉంది. ఎలాగైనా తెలంగాణను దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. కర్ణాటక ఫలితాలకు ముందు బీజేపీ వైపు చూసిన బడా నేతలు ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ చూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి, పొగులేటి అటువైపు వెళ్తుంటే వారిని బీజేపీలోకి తీసుకచ్చేందుకు యత్నించిన చేరికల కమిటీ మెంబర్ ఈటల రాజేందర్ ను వారే కాంగ్రెస్ వైపు రావాలని కోరడం అప్పట్లో దూమారం రేపింది. ఇక ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పార్టీలోకి ఎవరైనా రావచ్చు. నా కోసం రాకండి సోనియా, రాహుల్ గాంధీ కోసం రావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్, వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ ను కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెంకట్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయననే చేరికల కమిటీ మెంబర్ గా అనౌన్స్ చేశాడు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆయన కూడా దీన్ని సవాల్ గా తీసుకున్నాడు. పార్టీలోకి వీలైనంత ఎక్కువ మందిని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ను కలిసేందుకు వెళ్లారు. చేరికలకు ఆయన సలహాలు, సూచనలు తీసుకోవాలని వెళ్లారు. గతంలో ప్రియాంకా గాంధీ వచ్చిన సమయంలో ఆమె కూడా డీకేను కలిస్తే మంచి ప్రయోజనం ఉటుందని సలహా ఈ నేపథ్యంలో ఆయన కర్ణాటక వెళ్లారు.
పొరుగు రాష్ట్రం కర్ణాటకకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం (జూన్ 23)న వెళ్లారు. అక్కడ డీకే శివకుమార్ ను కలుస్తారు. సాయంత్రం వరకు వారు చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణలో చేరికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇద్దరూ చర్చిస్తారు. దీంతో పాటు పార్టీని పదవిలోకి తీసుకువచ్చేందుకు తీసుకున్న చర్యలను కూడా డీకే అడిగి తెలుసుకోనున్నారు వెంకట్ రెడ్డి. బీజేపీ నుంచి టచ్ లో ఉన్న నేతల వివరాలను ఆయనకు వివరించనున్నారు. వీటిని ఎప్పుడు ఎలా పార్టీలోకి పట్టుకురావాలో ఆయన సలహాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అయితే, కర్ణాటక, తెలంగాణలు రాజకీయంగా భిన్న ధ్రువాలు. కర్ణాటకలో ప్రతీ ఐదేండ్ల కు ఒకసారి ప్రభుత్వం మారడం సహజం, కానీ తెలంగాణలో అది సాధ్యం కాదు. అయితే బీజేపీకి అక్కడ ఓట్ల శాతం తగ్గకున్నా.. పవర్ లోకి రాలేదు. కానీ ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకును ఘణనీయంగా పెంచుకోగలిగింది. డీకే సలహాలు, సూచనలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.