
Rahul and Priyanka : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. అతిరథ మహరథులంతా బెంగళూరు చేరుకుంటున్నారు. ఆరో రోజుల ఉత్కంఠ, ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరాకే కాంగ్రెస్ వీరిని ప్రకటించింది. అయితే కర్ణాటకలో కొత్త ప్రభుత్వం మరికొన్ని నిమిషాల్లో కొలువు దీరనుంది. దీనికి సర్వం సిద్ధమైంది.
కర్ణాటకలో భారీవేడుకకు సర్వంసిద్ధమైంది. ఇందుకు కంఠిరవ స్టేడియం వేదికైంది. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు సమయం అసన్నమైంది. మరికొన్ని నిమిషాల్లో ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సీఎం గా సిద్ధ రామయ్యతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వారి పీసీసీ చీఫ్ హోదాలో డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికారు . కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో విమానశ్రయానికి చేరుకున్నాయి. రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య, డీకే అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అయితే ఈ వేడుకకు మరికొందరు వీవీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు ముఖ్య మంత్రులు, పలు పార్టీల కీలక నేతలు బెంగళూరు చేరుకుంటున్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కంఠీరవ స్టేడియంలో పూర్తయ్యాయి. సిద్ధరామయ్య అనే నేను.. అంటూ కన్నడలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రారంభం కానుంది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం పూర్తి కానుంది.