39.8 C
India
Friday, May 3, 2024
More

    South Elections : సౌత్ లో ఆ పార్టీదే హవా.. ఏపీలో ఏ పార్టీ అంటే

    Date:

    South Elections
    South Elections

    South Elections : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే చాన్స్ ఉందో చెబుతున్నాయి. తాజాగా టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది.

    దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకేకు 21-22 సీట్లు, కాంగ్రెస్ కు 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఖాతా ఓపెన్ చేయని బీజేపీ ఈసారి మాత్రం 2-6 సీట్లు సాధించే అవకాశం ఉందని వెల్లడించింది.

    కేరళ రాష్ట్రంలో బీజేపీ 0-1 ఎంపీ సీటు, కాంగ్రెస్ 8-10, సీపీఎం 6-8, ఐయూఎంఎల్ 1-2, ఇతరులు 1-2 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది. కర్నాటకలో మాత్రం బీజేపీ మంచి సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ 21-23, కాంగ్రెస్ 4-6, జేడీఎస్ 1-2 సీట్లు సాధించనుందని తెలిపింది.

    ఏపీలో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని తేల్చింది. వైసీపీకి 21-22 సీట్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3-4 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 8-10, బీజేపీ 4-6, బీఆర్ఎస్ 1-3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని చెప్పింది.

    కాగా, సర్వే ఫలితాలపై పలువురు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో జనం నాడిని ఈ సంస్థ సరిగ్గా అంచనా వేయలేదని అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏం లేదని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రాజధాని నిర్మాణం చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని..ఈ సమస్యలపై ఇప్పటికే జనాలు మండిపడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీకి డబుల్ డిజిట్ కాదు కదా కనీసం ఐదారు సీట్లు గెలిస్తే మహా ఎక్కువ అని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...