29.5 C
India
Sunday, May 19, 2024
More

    Pakistan : ఇమ్రాన్ ఇంట్లో ఉగ్రవాదులా..?

    Date:

    • చుట్టుముట్టిన బలగాలు
    • ఇదే నా చివరి ట్వీట్ అన్న పాక్ మాజీ ప్రధాని
    former prime minister of Pakistan
    Pakistan, imran khan

    Former Prime Minister of Pakistan said this is my last tweet : ఒకప్పటి క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ లో నూ ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆయన పాకిస్థాన్ లో తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పేరిట పార్టీని స్థాపించి ఏకంగా ప్రధాని అయ్యారు కూడా. అయితే ప్రధానిగా ఉండగా భారీగా  అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు. ఈ అవినీతి అంచనా రూ. 5వేల కోట్లు గా ఆరోపణలు ఉన్నాయి.

    బుధవారం తన ఇంటిని పోలీసులు చుట్టుముంటారంటూ ఒక ట్వీట్ చేశారు. బహుశా ఇదే తన చివరి ట్వీట్ కావచ్చు అంటూ అందులో పేర్కొన్నారు. ఇటీవల ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పాక్ లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలకు తనకు ఎం సంబంధం లేదని ఇమ్రాన్ ప్రకటించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అయితే పాక్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పీటీఐ పార్టీని ఉగ్రవాద సంస్థ ప్రకటించారని, తమ కార్యకర్తలను అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెడుతున్నారని ఇమ్రాన్ మండిపడుతున్నారు. అయితే తమ పార్టీ మద్దతుదారులకు ఆర్మీ మధ్య గొడవలు రేపేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

    అయితే ఇమ్రాన్ ఇంట్లో 40 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. వారిని లొంగిపొమ్మని  హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సెర్చ్ వారెంట్ తో రావాలని ఇమ్రాన్ వారిని కోరారు.  ప్రస్తుతం అక్కడ పూర్తి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థతి . ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. పాక్ లో ఇదంతా సర్వసాధరణమే అయినా,  ప్రస్తుతం ఉన్న కష్టాల్లో ఇది పేదలపై మరింత భారం మోపనున్నది.  అయితే ప్రస్తుత పరిణామాలను అమెరికాతో పాటు ఇతర దేశాలు పరిశీలిస్తున్నాయి. నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Zealand Vs Pakistan : పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

    New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...