31.6 C
India
Sunday, May 19, 2024
More

    Salman Khan body guard : విక్కీ కౌశల్ ను తోసేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్

    Date:

    Salman Khan body guard
    Salman Khan body guard, pushed Vicky Kaushal

    Salman Khan body guard : ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. అతడిపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ వాటిని లెక్క చేయడు. తన పని తాను చేసుకుపోతుంటాడు. ఎదుట ఏం జరిగినా పట్టించుకోడు. ఎదుటి వారికి కనీస గౌరవం కూడా ఇవ్వడు. తోటి నటులను కూడా లెక్కచేయడు. ఇలా ఎన్నోసార్లు వివాదాల్లో ఇరుక్కుంటాడు. గతంలో జింకను వేటాడిన కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో వివాదంలో దూరాడు.

    తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు (ఐఫా) 2023కు సంబంధించిన సమావేశం దుబాయ్ లో జరిగింది. దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ప్రవర్తన చర్చనీయాంశం అయింది. తన అహంకారానికి పరాకాష్టగా మిగిలింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ తీరు వివాదాస్పదంగా ఉందని చెబుతున్నారు.

    సల్మాన్ ఖాన్ తోపాటు మరో నటుడు విక్కీ కౌశల్ కూడా ఇందులో పాల్గొన్నాడు. విలేకరుల సమావేశం జరుగుతుండగా విక్కీ కౌశల్ ఫొటోలు దిగుతుండగా అటుగా వచ్చిన సల్మాన్ ఖాన్ కౌశల్ ను పట్టించుకోలేదు. అతడి బాడీగార్డ్ సైతం కౌశల్ ను తోసేయడం వివాదాస్పదంగా మారింది. తోటి నటుడికి కనీసం గౌరవం ఇవ్వకుండా సల్మాన్ వ్యవహరించిన తీరు అందరిలో ఆగ్రహం కలిగించింది.

    సల్మాన్ ఖాన్ కు ఇంతటి అహంకారం తగదని హితవు చెబుతున్నారు. తోటి నటుడిని పలకరించకుండా పోవడం ఒక తప్పు అయితే అతడి బాడీగార్డ్ చేసిన పనికి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అహంకారం నెత్తికి ఎక్కితే పతనం తప్పదని సూచిస్తున్నారు. అంతకంటే బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్న వారు సైతం కిందికి దిగినట్లు వెల్లడిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    Ram Charan : ఆ స్టార్ హీరోకు డబ్బింగ్ చెప్పిన రామ్ చరణ్

    Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు...

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Tiger3 1000 crores Scene : టైగర్ 3లో బాత్ టవల్ సీన్ తో రూ. 1000 కోట్లు వస్తాయా?

    Tiger3 1000 crores Scene : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్...