Ram Charan : ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలను అనువదించినప్పుడు ఆయా నటులకు అనుగుణంగా, వారికి సరిగ్గా సూటయ్యే వాయిస్ ను నిర్మాత, దర్శకులు ఎంచుకుంటుంటారు. వాయిస్ సెట్ అవలేదంటే సినిమా ఎంత బాగా ఉన్నప్పటికీ ఫ్లాపైన సందర్భాలు అనేకం ఉన్నాయి. హీరోల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా పోతుందని వారికీ తెలుసు.
ఒక స్టార్ హీరోకు మరో భాషలో అక్కడ స్టార్ హీరోగా ఉన్న నటుడు డబ్బింగ్ చెబుతుండటం సాధారణంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోగా చెలామణి అవుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ సినిమా ఆడలేదు కాబట్టింది. సల్మాన్ హీరోగా “ప్రేమ్ రతన్ కి ధన్ పాయో” పేరుతో హిందీలో సినిమా విడుదలైంది. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని భావించిన నిర్మాత, దర్శకులు డబ్బింగ్ కోసం రామ్ చరణ్ ను సంప్రదించారు.
సల్మాన్ తో మంచి సంబంధాలున్న రామ్ చరణ్ వెంటనే ఆ సినిమాలో ఆయనకు డబ్బింగ్ చెప్పా రు. అయితే తెలుగులో ఈ సినిమా విజయవంత మవలేదు. స్నేహం కోసం తమ హీరో ఏదైనా చేస్తా డంటూ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుచేస్తు న్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్.
ప్రస్తుతం తన తండ్రినే మించిపోయిన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ స్టార్ హీరోగా అవతరిం చారు. RRR చిత్రంతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ చేస్తున్నారు. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.