35.1 C
India
Wednesday, May 15, 2024
More

    Indigestion : అజీర్తి సమస్యకు అసలైన కషాయం ఏంటో తెలుసా?

    Date:

    indigestion
    indigestion

    Indigestion : ఈ రోజుల్లో జీర్ణ సంబంధమైన సమస్యలు వెంటాడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో మంట, గొంతులో మంట, గ్యాస్, మలబద్ధకం, తేన్పులు ఎక్కువగా రావడం జరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడితేనే ఇలాంటి లక్షణాలు బయటపడతాయి. అరికాళ్లు, అరచేతుల్లో మంటలు వస్తాయి. సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది. కళ్లల్లో మంట, తలనొప్పి, నోటిలో అల్సర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది.

    జీలకర్ర కూడా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించి జీర్ణ శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఇంకా ధనియాలు కూడా మనం తిన్ని ఆహారం అరగడానికి దోహదపడుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. మూత్రపిండాల ఆరోగ్యాన్ని బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోంపు, జీలకర్ర, ధనియాల సాయంతో మంచి కషాయం తయారు చేసుకోవచ్చు.

    ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు పోసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసి కలుపుకోవాలి. వీటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం రెండు నిమిషాలు మరిగించి వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ నీటిని పరగడుపున తాగడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

    దీన్ని తాగితే ఆకలి పెరుగుతుంది. ఇందులో కాస్త నల్ల ఉప్పు లేదా తేనెను కూడా కలుపుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచుకునేందుకు సాయపడుతుంది. అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అరికాళ్ల మంటలను దూరం చేస్తుంది. వాపులు, కీళ్లనొప్పులు లేకుండా చేస్తుంది. ఈ కషాయంతో జీర్ణ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Benefits of Fenugreek Leaves : మెంతి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు

    Benefits of Fenugreek Leaves : మనకు ప్రస్తుత రోజుల్లో మధుమేహం...

    Indigestion Problems : అజీర్తి సమస్యలను ఇలా దూరం చేసుకోండి

    Indigestion problems : ప్రస్తుత రోజుల్లో కడుపులో మంట, గొంతులో మంట,...

    Check gas problem : రెండు నిమిషాల్లోనే గ్యాస్ సమస్యకు చెక్

    Check gas problem : ప్రస్తుతం చాలా మంది గ్రాస్ట్రిక్ సమస్యలతో...

    ఇవి తింటే గ్యాస్ సమస్యలు తప్పనిసరి

    నాలుక రుచి కోరుకుంటుందనే సాకుతో పకోడి తింటుంటారు. దీంతో అది త్వరగా...