33.2 C
India
Sunday, May 19, 2024
More

    వాము ఆకుతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు

    Date:

    Health benefits of wamu leaf too
    Health benefits of wamu leaf too

     

    వాము మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదర సంబంధమైన సమస్యలకు చెక్ పెడుతుంది. వాముతో పాటు దాని ఆకులు కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వాము వాడకం వల్ల మనకు ఎన్నో రకాలైన మేలు కలుగుతాయని చెబుతుంటారు. ఆయుర్వేదంలో పలు రోగాలకు దీన్ని వాడి వ్యాధులను నయం చేసుకోవడం కామనే.

    చిన్న పిల్లలకు అజీర్తి తో కడుపు నొప్పి బాధిస్తుంటే వాము ఆకుల రసంతో తేనె కలిపి తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్నపిల్లలు తరచు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. వాము ఆకు కూడా మంచి మందులా ప్రయోజనాలు కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే దీన్ని వాడుకుని లాభం పొందాలి.

    కాలిన గాయాలు, మచ్చలకు కూడా వాము ఆకు పనిచేస్తుంది. యాంటీ సెప్టిక్ గుణాలుండటం వల్ల గాయాలను తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వాము ఆకు తలనొప్పికి ఔషధంలా మారుతుంది. తలనొప్పి ఉన్న చోట రాస్తే తగ్గుతుంది. ఏదైనా పురుగు కుడితే వాము ఆకును రుద్దితే విషయం బయటకు పోతుంది.

    వాము ఆకులను నమిలితే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.వాముతో రసం కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు, పెద్దల అనారోగ్య సమస్యలను లేకుండా చేస్తుంది. ఇలా వాము ఆకుతో మనకు అనేక రకాలైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Water : నీటి ఊట.. కాదట పైపు లైనంట

    Water : బోరు వేస్తే నీళ్లు ఎక్కడ పడతాయోనని కొబ్బరి కాయ...