31.6 C
India
Sunday, May 19, 2024
More

    YCP Counter Attack : వైఎస్ కుటుంబ ఆడబిడ్డపై వైసీపీ ఎదురుదాడి.. పట్టించుకోని జగన్

    Date:

    YCP counter attack
    YCP counter attack

    YCP counter attack : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబమంతా ఒక వెలుగు వెలిగింది. కలిసికట్టుగా ముందుకు సాగింది. అయితే వైఎస్ మరణాంతరం ఎన్నో ఒడిదుడుకులను ఆ కుటుంబం ఎదుర్కొంది. ముఖ్యంగా వైఎస్ జగన్ తీరుతో చాలా ఇబ్బందులప పాలైంది. ఆ తర్వాత వైఎస్ వివేకా హత్య అనంతరం ఆ కుటుంబం రెండు ముక్కలుగా చీలినట్లుగా కనిపిస్తున్నది. వైఎస్ వివేకా హత్య, ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు జగన్పై మాయని మచ్చని మిగిల్చాయి.

    ఆడబిడ్డ ఒంటరి పోరాటంపై నిందలు

    తండ్రి హత్యపై వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కోర్టులు, సీబీఐ వెంట పరిగెడుతూ తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయంగా తన బంధువులే ఈ హత్య చేశారని తెలుసుకొని, ఎక్కడా తగ్గకుండా, తన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా, ఆమె ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు చాలా మంది నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే మరోవైపు వైసీపీ శ్రేణులు ఆమె పోరాటాన్ని శంకిస్తున్నాయి. నారా సునీత అంటూ ఆమె పై పోస్టులు పెడుతూ .దూషిస్తున్నాయి. మరోవైపు టీడీపీతో కలిసి ఆమె కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నాయి. సాక్షి పత్రిక కూడా ఆమెపై నిందారోపణలు చేస్తూ కథనాలు ప్రచూరిస్తున్నది. ఇదంతా జగన్ కు తెలవకుండా జరిగే వీలు లేదు. ఒక దశలో ఆస్తికోసం సునీత, తన భర్త కలిసి వివేకాను హత్య చేయించారని ఆరోపణలు కూడా చేసింది. అయితే షర్మిల దీనికి కౌంటర్ ఇవ్వడంతో సునీతపై బురద జల్లే వారికి చుక్కెదురైంది.

    జగన్ కు తెలిసే..

    వైఎస్ వివేకా హత్య కేసులో వెళ్లన్నీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వారిని కాపాడేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. తన బాబాయి హత్యను కూడా గతంలో రాజకీయంగా వాడుకున్న వ్యక్తి, ఇప్పుడు తాను అధికారంలో ఉన్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. న్యాయ పోరాటం చేస్తున్న ఆడబిడ్డకు అండగా నిలవాల్సింది. పోయి జగన్ చేస్తున్నదంతా విమర్శల పాలవుతున్నది. సొంత బాబాయి బిడ్డపై పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, స్వయంగా రాష్ట్ర అడవుల డెవలప్ మెంట్ చైర్మన్ కూడా సునీతాపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా, జగన్ మందలించలేదు.

    ఇక సజ్జల తదితరులు కూడా ఆయనతో కలిసి సునీతపై ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య తర్వాతే విజయమ్మ, షర్మిల జగన్ తో విభేదించారని, వారితో ఇప్పుడు జగన్కు సఖ్యత లేదని అంతా టాక్ నడుస్తున్నది. తన తండ్రి మరణంపై సునీత చేస్తున్న పోరాటాన్ని కించపరిచేలా వైసీపీ శ్రేణులు, సాక్షి మీడియా చేస్తున్న ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీబీఐ కూడా ఒక దశలో నిందితులను తేల్చేసింది. ఇప్పటికే ఇందులో పాత్రధారులు ఎవరు. సూత్రాధారులు ఎవరో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...