28 C
India
Friday, May 17, 2024
More

    Sri Vishnu : పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేయనున్న శ్రీవిష్ణు.. ఏ సినిమాతో తెలుసా?

    Date:

    pawan kalyan
    pawan kalyan

    Sri Vishnu సినిమాలో హీరోలను పక్కన పెడితే మంచి కంటెంట్ ఉంటే ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆదరించే వారు లేకపోలేదు. ఇటీవల జపాన్ లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇంకా ప్రపంచలో ఏదో ఒక దేశంలో ఆర్ఆర్ఆర్ ఆడుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అగ్రహీరో సినిమా అని, అగ్ర డైరెక్టర్ అని తేడా లేకుండా మంచి కథ, కథనం ఉంటే చాలు హాయిగా వీక్షించిన ప్రేక్షకులు గుడ్ మార్క్స్ వేస్తారు. అలాంటి సినిమానే ఈ మధ్య కాలంలో రిలీజైన ‘సామజవరగమన’.

    రామ్ అబ్బరాజు ఈ సినిమాకు డైరెక్షన్ చేయగా, హీరోగా శ్రీవిష్ణు నటించారు. ఆయన సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్ గా చేసింది. పూర్తి ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ నుంచే కలెక్షన్ల మోత మోగిస్తోంది. మూడో రోజు బ్రేక్ ఈవెన్ అందుకుంది. రాను రాను బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతోంది. నాలుగో రోజు నుంచి భారీ వసూళ్లకు తెరలేపింది. ఇటీవల 10 రోజుల పాటు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 7.12 కోట్ల షేర్, రూ. 13.05 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక, వరల్డ్ వైడ్ షేర్ రూ. 10.37 కోట్లు, రూ. 20.35 కోట్ల గ్రాస్ సాధించింది. రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ. 6.87 కోట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకొని ధుమ్ము రేపుతోంది.

    ఓవర్సీస్‌లోనూ ‘సామజవరగమన’ తన సత్తాను చాటుకుంటుంది. కేవలం రూ. 25 లక్షలకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు. సెకండ్ వీకెండ్ లోకి అడుగుపెట్టక ముందే రూ. 2 కోట్ల షేర్ వసూలు చేసింది. దీనికి తోడు ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ రికార్డును శ్రీవిష్ణు బ్రేక్ చేయనున్నట్లు కనిపిస్తుంది. కరోనా సమయంలో రిలీజైన పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ అమెరికాలో 7 లక్షల 80 వేల డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ ‘సామ‌జ‌వ‌రాగ‌మ‌న’ వకీల్ సాబ్ వసూళ్లను క్రాస్ చేయ‌బోతోంది. ఇప్పటికే అమెరికాలో 7 లక్షల 20 వేల డాలర్లు సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో మరో 8 లక్షల డాలర్లకు పైగానే రాబట్టే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...