31 C
India
Friday, May 17, 2024
More

    twitter : ట్విటర్ పిట్ట మాయం.. అసలు “X” అని ఎందుకు పెట్టారు..

    Date:

    twitter logo
    twitter logo

    twitter ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ఎలన్ మస్క్ గతంలో ట్విటర్ లో కొంత పెట్టుబడి పెట్టానా.. తర్వాత దాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నాడు. గతేడాది 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అందులో సమూలంగా మార్పులు తీసుకువస్తున్నారు ఆయన. గతంలో ఉద్యోగుల తొలగింపు నుంచి ప్రస్తుతం ట్విటర్ పిట్ట వరకు. ట్విట్టర్ ప్రసిద్ధ బ్లూ బర్డ్ స్థానంలో ‘X’ లోగోను చేర్చారు. సోమవారం (జూలై 24) నుంచి ట్విట్టర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో X కనిపించింది. అయితే ఇంకా స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో మాత్రం పక్షి బొమ్మే ఉంది. దాన్ని కూడా కొన్ని రోజుల్లో మారుస్తామని సంస్థ తెలిపింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ఆఫీస్ లో ఉద్యోగులు కూడా పక్షి లోగోను తీసివేశారు. మధ్యాహ్నం వరకు, ట్విట్టర్ చివరిలో ‘er’ కనిపిస్తుంది.

    ట్విటర్ లో భారీ షేర్ ఉన్న ఎలన్ మస్క్ కు దీన్ని కొనుగోలు చేయాలని లేదు. కానీ పరిస్థితుల దృష్ట్యా దీన్ని అయిష్టంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇది ఒక శకం ముగింపు, గత 17 సంవత్సరాల ట్విట్టర్ బర్డ్ పోయిందని తిరిగి రాదని స్పష్టమైన సంకేతం’ అని ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు జాస్మిన్ ఎన్‌బెర్గ్ అన్నారు. అయితే ట్విటర్ ను సమూలంగా మారుస్తానని మస్క్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాడు.

    ‘X’ ఎందుకు?
    ఎలన్ మస్క్ కు X అక్షరం అంటే ఇష్టం. ఆయన కంపెనీలను మొదటి నుంచి ఈ అక్షరంతోనే నడిపిస్తున్నాడు. వీటితో పాటు తన కొడుకుల్లో ఒకరిని X అని పిలుస్తాడు. ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత దాని కార్పొరేట్ పేరును X Corp. గా మార్చాడు. రీబ్రాండింగ్ పూర్తయిన ట్వీట్లన ఏమని పిలుస్తారని మస్క్ ను అడుగగా Xs అంటారని చెప్పారు. ఇక మస్క్ బిలియన్ రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ కు సీఈవోగా ఉన్నారు. దీనికి ఆయన పెట్టిన పేరు Space X. దీంతో పాటు Chat GPT కి పోటీగా xAI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని ఈ నెలలోనే ప్రారంభించారు. 1999లో ఆయన స్టార్టప్ కంపెనీ X.com.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు...

    Nara Lokesh: ట్విట్టర్ నారా లోకేష్ హవా..వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు… ట్విట్టర్ లో 2 స్థానం!

      నేడు టిడిపి యువనేత లోకేష్  జన్మదిన సందర్భంగా టిడిపి కార్యకర్తలు, తెలుగు...