27.2 C
India
Tuesday, July 2, 2024
More

    Heavy Rains : నిద్రలో పల్లె.. నిండా ముంచిన వరద..

    Date:

    Heavy Rains
    Heavy Rains
    Heavy Rains తెలంగాణలో వానల తో వచ్చిన వరద పెద్ద బీభత్సాన్ని సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో పల్లెలు నిద్రపోతున్న వేళ వరద ముంచెత్తింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం అత్యంత దీనస్థితిని ఎదుర్కొంది. ఆ పల్లె పరిస్థితిని చూసిన వారంతా అయ్యో పాపం అనుకుంటూ ఆవేదన చెందారు. తమను కాపాడాలని గ్రామస్తులు చేసిన హాహాకారాలు టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి వారంతా బాధపడ్డారు
    అదమరిచి నిద్రపోతున్న వేళ ఆ పల్లె లోవెయ్యికి పైగా జనాభా వరదలో చిక్కుకుంది. కేవలం అరగంట సమయంలోనే వరద ఒక్కసారిగా పల్లెను ముంచెత్తింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు అంత భయాందోళనకు గురయ్యారు. రాత్రంతా అర్ధనాదాలతోనే గడిచిపోయింది. ఉదయం అయ్యాకే బయట ప్రపంచానికి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది చెట్లు ఎక్కి, దాబాలు ఎక్కి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. తొమ్మిది గంటల పాటు వరదలోనే వణికిపోతూ సాయం కోసం ఎదురు చూశారు. ఉదయం 5 గంటలకు విషయం తెలిశాక అధికార యంత్రాంగం  సహాయక చర్యలకు ఉపక్రమించింది.  ఊరి పరిస్థితి చూసి వెంటనే కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
    రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ఎస్పీ కరుణాకర్ వెంటనే ఆ గ్రామానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు‌ రంగంలోకి దిగిన యంత్రాంగం దాదాపు 1000 మందిని పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. చెట్లపై దాక్కున్న ఎనిమిది మందిని హెలికాప్టర్ల ద్వారా కాపాడారు. వారందరికీ అప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందించారు. అయితే గ్రామానికి చెందిన ఐదుగురు వరదలో గల్లంతయినట్లు తెలుస్తున్నది. ఇప్పటికి కూడా ఆ గ్రామాన్ని వరద వీడలేదు.

    Share post:

    More like this
    Related

    Software Employee : తిరుమల శ్రీవారి ప్రసాదం ఇచ్చి వెళ్తూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

    Software Employee : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని స్నేహితులకు ఇచ్చి...

    Jai Chandranna : రూ.7 వేలు పెన్షన్ అందుకున్న లబ్దిదారుడి ఆనందం.. జై చంద్రన్న అంటూ నినాదాలు

    Jai Chandranna : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా...

    NTR Bhavan : ఎన్టీఆర్ భవన్ పై దాడిపై విచారణ స్పీడప్..ఇక వాళ్లకు దబిడే దిబిడే

    NTR Bhavan attack Case : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై...

    Minister Wife Warning : పోలీసులకు మంత్రి భార్య వార్నింగ్.. చంద్రబాబు సీరియస్

    Minister Wife Warning : సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన రోజు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....