39 C
India
Sunday, May 19, 2024
More

    Employee: మీ భార్య ఉద్యోగి అయితే ఇలా చేయండి

    Date:

    Employee iin wife
    Employee iin wife

    Employee: ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కానీ ఇప్పుడు స్త్రీ లక్షణం కూడా అదే అవుతోంది. ప్రస్తుత తరుణంలో ఒక్కరు పనిచేస్తే కుదరడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. దీంతో కుటుంబం సాఫీగా సాగాలంటే మహిళలు కూడా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో మగాళ్లలో కూడా మార్పులు వస్తున్నాయి. పూర్వం రోజుల్లో మహిళలను వంటింటి కుందేలు అనేవారు. కానీ ఇప్పుడు వారు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఏ రంగంలోనైనా మహిళల పాత్ర ఉంటోంది. ఈనేపథ్యంలో మహిళే నేటి సమాజానికి దిక్సూచిలా మారుతోంది.

    గతంలో మహిళలను బాహ్య ప్రపంచానికి రానిచ్చేవారు కాదు. అసలు చదువు చెప్పించే వారు కూడా కాదు. ఓ అయ్య చేతిలో పెడితే పోయేబిడ్డకు చదువెందుకు అనే భావం కలుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది. ఇంట్లో ఇద్దరు కష్టపడితేనే సంపాదన పెరుగుతుంది. దీంతో అవసరాలు తీరుతాయి. కానీ ఒక్కరు పనిచేసి భార్య ఇంట్లో ఉండే పరిస్థితులు పోయాయి.

    చిన్నదో పెద్దదో పని భర్తతో పాటు భార్య చేస్తేనే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకునే వారు ఉద్యోగం చేసే వారిని ఎంచుకుంటున్నారు. కానీ ఇద్దరు జాబ్ చేస్తే ఇద్దరు కూడా ఇంటి పని పంచుకోవాలి. పిల్లల సంరక్షణకు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ భార్యతో సగభాగం పంచుకుంటేనే ఇద్దరు ఉద్యోగం చేయడానికి వీలవుతుంది. లేదంటే సంసారాలే విడిపోయే పరిస్థితులు వస్తాయి.

    అందుకే పెళ్లి చేసుకునేటప్పుడే అన్ని నిర్ణయించుకోవాలి. ఏదో పెళ్లి చేసుకుని బాధ్యతలు ఆమె మీద వేస్తానంటే కుదరదు. ఆమె పనుల్లో సగం పంచుకోవాలి. బట్టలు ఉతకవడం, అంట్లు తోమడం, పిల్లలను రెడీ చేయడం వంటి పనుల్లో ఆడవారికి తోడుగా ఉంటే వారికి కూడా పనులు సులభం అవుతాయి. అంతేకాని అన్ని పనులు ఆమె మీద నెట్టేసి హాయిగా ఉంటానంటే సమస్యలొస్తాయి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...