Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. కాపురంలో ఎన్నో విషయాలుంటాయి. కలతలుంటాయి. కలహాలుంటాయి. కోపాలు, ఆవేశాలు, ప్రేమలు అన్ని కలిసే ఉంటాయి. వాటిని మనం వ్యక్తం చేసే తీరులోనే మన సహజత్వం ఉంటుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తే పెద్దగానే కనిపిస్తుంది. ఆంగ్లంలో ఓ సామెత ఉంది. ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్. ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపును తెరుస్తుంది. అలాగే మన సమస్యకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఉండాలి.
ప్రస్తుత కాలంలో అందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఇష్టపడుతున్నారు. వారికున్న సమస్యల కారణంగా వారి ప్రవర్తన కూడా కొన్ని సార్లు అవధులు దాటుతుంది. జీవిత భాగస్వామిని ఏదో ఒకటి అనడం తరువాత పశ్చాత్తాప పడటం లాంటివి చేస్తుంటారు. సంసారమన్నాక సర్దుకుపోవాలి. అన్ని మనమే సరి చేసుకోవాలి. తప్పులుంటే క్షమించాలి. మంచి పనులు చేస్తే ప్రశంసించాలి. ఎందుకంటే మనం మనుషులం. మనకు మాత్రమే క్షమించే గుణం ఉంటుంది.
భార్యాభర్తలన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. భర్త తిట్టాడనో, భార్య హేళన చేసిందనో దూరంగా ఉండొద్దు. వారి తప్పుకు వారికి తెలియజేయాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలని సలహా ఇవ్వాలి. చెడు అలవాట్లు ఉంటే దూరం చేసుకోవాలి. మంచి అభిప్రాయాలు కలిగి ఉండాలి. అప్పుడే సంసారమనే కాపురం సజావుగా సాగుతుంది. ఆలుమగల్లో ఎలాంటి అరమరికలు రాకుండా ఉంటాయి.
సంసార బంధంలో భర్త పాలు అయితే భార్య నీళ్లు రెండు కలిస్తేనే అర్థం ఉంటుంది. అలాగే మొగుడు పెళ్లాం పొద్దున పోట్లాడినా సాయంత్రం ఇద్దరు ఒక్కటి కావడమే కావాలి. అలా అయిన వాళ్లు జీవితంలో ఓటమి చెందలేదు. అలాగే సంసార బంధాన్ని చక్కగా నడిపించుకోవడం ఇల్లాలిపైనే ఉంటుంది. తన భర్తను అన్నింట్లో మంచిగా తయారు చేసి కాపురాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆమెదే అంటున్నారు నిపుణులు.