31 C
India
Monday, April 29, 2024
More

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    Date:

    Delhi high court
    Delhi high court

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా సంస్కృతి సంప్రదాయాలలో ప్రపంచానికే ఆదర్శం. దీన్ని ముందు తరాలు మనకు బహుమతిగా ఇచ్చాయి. ఇండియా విలువలు కాపాడేది ఇప్పటికీ, ఎప్పటికీ కుటుంబ వ్యవస్థే. ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వ్యక్తికి బంధులు, బంధుత్వాల విలువ తెలుస్తుంది. ఫలితంగా మంచి పౌరుడిగా ఎదుగుతాడు.  ఈ విషయాలను ఎంతో మంది మానసిక వైద్యులు కూడా ధ్రువీకరించారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికే మంచి నడవడి ఉంటుంది. ఫలితంగా ఉన్నతంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.

    కానీ రాను రాను ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకుండా పోతోంది. వివాహం అయిన వెంటనే వేరు కాపురం పెట్టాల్సిందే అంటూ భార్య, భార్య తరుపు బంధువులు భర్తపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఇక అతను వినకుంటే క్రిమినల్ యాక్ట్ లను అస్త్రంగా చేసుకుంటున్నారు. 498/A, డీవీసీ లాంటి కేసులు పెట్టడంతో పాటు అతని కుటుంబంలోని ప్రతీ ఒక్కిరిని కోర్టుకు లాగి వారికి మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నారు. ఈ విధానం తప్పని దేశ అత్యున్నత న్యాయస్థానం సంవత్సరాల నుంచి చెప్తున్నా ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు భార్యలు.

    గతంలో సుప్రీం కోర్టు భార్య బలవంతంగా వేరు కాపురం పెట్టాలని వేధిస్తే విడాకులు ఇవ్వవచ్చు. దీంతో పాటు భరణం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఒక కేసు సందర్భంగా చెప్పింది. అయినా కూడా ఇలాంటి కేసులు డిస్ట్రిక్ట్ కోర్టుల నుంచి హై కోర్టుల వరకు వస్తూనే ఉన్నాయి. అందులో కూడా ఇదే తరహా తీర్పులు వచ్చినా ఎవరూ వినడం లేదన్న వాదనలు ఉన్నాయి. రీసెంట్ గా ఢిల్లీ హై కోర్టు కూడా మరో తీర్పు ఇచ్చింది.

    ‘సరైన కారణం లేకుండా భర్తను అతని తల్లిదండ్రుల నుంచి విడిపోవాలని భార్య పదేపదే ఒత్తిడి చేయడం క్రూరత్వమే..’ అని ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించింది. ప్రాశ్యాత్య దేశాల్లో లాగా వివాహం కాగానే తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరుగా రావడం భారత్ లో జరగదని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేసింది. ఒక జంటకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    High Court: వ్యూహం సినిమా విడుదలపై..నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

      వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు ...

    High Court Break : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

        హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది....