Arranged Marriage : ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద ఘటన. కలకాలం తమతో జీవించే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అద్భుతమైన క్షణాలు అవి. పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టే ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి మీ దగ్గర తగిన సమాధానాలు ఉంటేనే వివాహ బంధంలోకి ప్రవేశించాలి. ఇక పెద్దలు కుదిర్చిన పెళ్లిలకు ఒప్పుకునే ముందు కొన్ని విషయాలను మీకు మీరు తెలుసుకోవాలి.
సంవత్సరాల తరబడిగా మీ తల్లిదండ్రులు సంబంధాలు వెతకవచ్చు. కానీ మీకు నిర్ణయం తీసుకునే అవకాశం 5-10 రోజులే ఉండవచ్చు. ఇలాంటప్పుడే మీ జీవితం గురించి మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్ ను నిర్ణయించుకోవచ్చు. అరెంజ్డ్ మ్యారేజ్ కు సిద్ధపడితే ఈ ప్రశ్నలను మీకు మీరు వేసుకోండి.
1. మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
మీరు పెళ్లికి సిద్ధంగా ఉన్నారా? వృద్ధాప్యం గురించి ఆందోళన చెందుతూ, ‘‘మా తల్లిదండ్రులు మా కోసం అనేక ప్రొఫైల్ లను వరుసలో ఉంచారు. ప్రతీ వారం లేదా నెలలో ఎవరైనా లేదా మరొకరిని కలిసే కార్యక్రమం ఉంటుంది. మీరు బలవంతంగా ఎవరినైనా కలుస్తారు… కానీ ఇవి చేసే ముందు మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనేది చూసుకోవాలి.
2. అవతలి వ్యక్తితో కలిసి జీవించగలరా?
మీరు పెళ్లికి సిద్ధమైనప్పుడు మీరో ప్రశ్న వేసుకోవాలి. మీరు చూసిన వ్యక్తితో మీరు జీవితాంతం కలిసి ఉండగలరా? ఎదుటి వ్యక్తి ఆలోచన విధానం, అభిరుచులు మీకు సెట్ అవుతాయా? అనేది చూసుకోవాలి. ఈ విషయమై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
3. మీరు సంబంధంలో ఏమి చూస్తారు?
చాలా మంది యువకులకు గతంలో ఏవే ప్రేమలు ఉండి ఉంటాయి. కొందరికి బ్రేకప్స్ కూడా ఉంటాయి. అలాంటి మీరు అరెంజ్డ్ మ్యారేజ్ కు సిద్ధంగానే ఉన్నారా? ఆమెతో మీరు ఆనందంగా ఉండగలరా? ఇవన్నీ చూసుకోవాలి. నేటి సంతోషం రేపు మిమ్మల్ని బాధించే అవకాశం ఉందా? మీకు వచ్చిన సంబంధంలో మీకు అనుకూలమైన అంశాలు ఉన్నాయా? మీ మనస్సుకు నచ్చిందా? మీ భవిష్యత్ బాగుంటుందని అనుకున్నప్పుడే ఆ సంబంధానికి ఓకే చెప్పండి.
4. బాధ్యతలను తీసుకోవడానికి సిద్ధమేనా?
పెళ్లి అంటే ఏదో సంబరం కాదు. దాని వెనక ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కాపురాన్ని మొత్తం నడిపించాల్సింది మీరే కాబట్టి ఆర్థికంగా మీరు బాగున్నారా? కాపురాన్ని నడుపగలరా అనేది చూసుకోవాలి. వీలైనంత వరకు మంచి ఉద్యోగం, ఉపాధి చూసుకున్న తర్వాతనే పెళ్లికి అంగీకరిస్తే బాగుంటుంది.
అరెంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇద్దరు మనసులు కలువాలి. ఒకరికొకరు అర్థం చేసుకోగలగాలి. భాగస్వామి ఏదైనా పొరపాటు చేస్తే క్షమించగలగాలి. దాంపత్య జీవనంలో ఆధిపత్య ధోరణి అసలే ఉండకూడదు. అప్పుడే ఆ దాంపత్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.