36.2 C
India
Thursday, May 16, 2024
More

    MS Dhoni :ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా గుర్తు ఉండదు.. ఎందుకో తెలుసా?

    Date:

    Dhoni's helmet does not have the national flag symbol
    Dhoni’s helmet does not have the national flag symbol

    MS Dhoni :

    టీమ్ ఇండియా కాప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఇక ఆయన దేశభక్తి గురించి చెప్పాలంటే మాటలు కూడా చాలవు. జార్ఖండ్ డైనమైట్ గా జట్టులోకి వచ్చిన ఆయన భారత్ కు వరల్డ్ కప్ అందజేసి దేశం కీర్తి ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప జేశారు.

    ఆ తర్వాత ఐపీఎల్ లో కొనసాగుతూనే ఆర్మీ బెటాలియన్ లో శిక్షణ తీసుకున్నాడు. 15 రోజుల పాటు శిక్షణ తీసుకొని జమ్ము కశ్మీర్ లో సైనికుడిగా కూడా విధులు నిర్వర్తించాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పని చేశాడు.
    ఓ క్రీడాకారుడిగా.. సైనికుడిగా దేశం పట్ల ఎప్పటికీ తన ప్రేమను చూపే ధోనీ తన హెల్మెట్ పై మాత్రం జాతీయ జెండా గుర్తును పెట్టుకునే వాడు కాదు. ఈ విషయంపై చాలా చర్చలే జరిగాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    టీమ్ మిండియా దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌తో పాటు విరాట్ హెల్మెట్లపై బీసీసీఐ గుర్తుతో పాటు జాతీయ పతాకం కనిపిస్తుంది. కానీ ధోనీ హెల్మెట్ పై ఒక బీసీసీఐ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. దేశ భక్తుడిగా ఆయన తన హెల్మెట్ పై జాతీయ జెండా సింబల్ ఉంచుకునే వారు కాదట. వికెట్ కీపర్ గా చేస్తున్న సమయంలో ప్రతీ సారి హెల్మెట్ కింద పెట్టాల్సి వచ్చేది. ఆ సమయంలో జాతీయ జెండాను కింద పెట్టినట్లు అవుతుందని భావించి తన హెల్మెట్‌పై జాతీయ జెండా గుర్తును పెట్టుకునేవాడు కాదట. ఈ విషయాన్ని అతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

    మూడేళ్ల క్రితం దేశ స్వాతంత్ర్య దినోత్సవం( ఆగస్టు 15) రోజు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ సమయంలో ఇండియాతో పాటు ప్రపంచలోని చాలా మంది ఆయన అభిమానులు తీవ్ర వేదనకు గురయ్యారు. కానీ వారి కోసం తను ఐపీఎల్ లో ఆడుతానని చెప్పాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బాధ్యతలు వహిస్తూ ఇప్పటికి ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ కట్టబెట్టాడు. భారత్ తరఫున 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ-20లు ఆడిన ధోని 17 వేల రన్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా టీమ్ మిండియాకు టీ-20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చాడు. ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న ధోని ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    MS Dhoni : ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు ఉండదో తెలుసా?

    MS Dhoni  : మన భారత క్రికెట్ జట్టుకు ఎందరో సేవలందించారు. మన...

    IPL CSK : భారం వదిలించుకున్న సీఎస్కే.. ఆ ఆల్ రౌండర్ గుడ్ బై..

    IPL CSK : ఐపీఎల్-2024 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై...