39 C
India
Sunday, May 19, 2024
More

    LB Nagar Incident : మగువ తెగువ.. ప్రేమోన్మాదిని భయపెట్టిన ఝాన్సీ

    Date:

    LB Nagar Incident :
    ఆడది అబల కాదు సబల మరోసారి రుజువైంది. ఇటీవల ప్రేమోన్మాదంతో హత్యలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ మహిళ చూపిన తెగువ అందరి ప్రశంసలు పొందుతోంది. ఎవరైనా చంపడానికి వస్తే అందరు పారిపోతారు. కానీ ఆమె మాత్రం కర్ర అందుకుని ధైర్యంతో ముందడుగు వేసి లోపల ఉన్న ప్రేమోన్మాదిని భయపెట్టింది. ఆమెను వదలకపోతే నీ అంతు చూస్తానని హెచ్చరించి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. దీంతో చివరకు ప్రేమోన్మాదిని కటకటాలపాలు చేసింది.

    వివరాల్లోకి వెళితే ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంట్లోకి ప్రేమోన్మాది శివకుమార్ కత్తితో ప్రవేశించాడు. సంఘవి సోదరుడిని కత్తితో పొడిచాడు. దీంతో అతడు బయటకు వచ్చాడు. లోపల ఉన్న యువతి భయంతో కేకలు వేసింది. దీన్ని గమనించిన పొరుగింట్లో ఉన్న మహిళ ఝాన్సీ కర్ర పట్టుకుని వచ్చింది. జరిగిన విషయం తెలుసుకుంది. లోపల ఉన్న యువతిని కాపాడాలని అప్రమత్తమైంది.

    ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె సోదరుడి ద్వారా విషయం తెలుసుకుని ఆమెను కాపాడాలని నిర్ణయించుకుంది. కర్రతో తలుపులు బాదుతూ ఆమెను ఏమైనా చేశావంటే నీ ప్రాణాలు తీస్తానని బెదిరించింది. దీంతో ప్రేమోన్మాది భయపడ్డాడు. ప్రేమోన్మాదికి భయపడిన సంఘవి ఓ గదిలో దాక్కుంది. దీంతో కాలనీలోని యువతను పిలిచింది. పోలీసులకు కూడా సమాచారం అందించింది.

    అందరు రావడంతో ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఝాన్సీ తెగువకు కాలనీవాసులు ఆశ్చర్యపోయారు. ఆమెలో ఉన్న ధైర్యం ప్రతి ఒక్క మహిళలో ఉండాలని సూచించారు. చంపుతానని వచ్చిన వాడిని బెదిరించి లొంగిపోయేలా చేసిన ఝాన్సీని మరో ఝాన్సీ లక్ష్మీబాయిగా అభివర్ణించారు. ఆమె వల్లే సంఘవి ప్రాణాలకు రక్షణ కలిగింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పాతికేళ్ళు పూర్తి చేసుకున్న డాక్టర్ రాజశేఖర్ శివయ్య

    యాంగ్రీయంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన సంచలన చిత్రం ''...

    డాలస్ లో వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

    విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ( women empowerment telugu association...

    డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కానున్న అంజలి వెబ్ సిరీస్ “ఝాన్సీ” సీజన్ 2

    టాలీవుడ్ ప్రముఖ నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌...