39 C
India
Sunday, May 19, 2024
More

    LEO Movie : ‘లియో’ మాస్టర్ ప్లాన్.. వేరే లెవల్..!

    Date:

    LEO Movie Updates
    LEO Movie Updates

    LEO Movie :

    సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఒకటి రెండు రోజుల ముందు లేదంటే ఓ వారం రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెడుతారు. ఇది మామూలు విషయమే. కానీ ‘లియో’ సినిమా విషయంలో మాత్రం నిర్మాతలు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఏకంగా 40 రోజుల ముందు నుంచే సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టి అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకున్నారు.

    ‘లియో’లో తలపతి విజయ్ హీరోగా నటిస్తుండగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎస్.ఎస్ లలిత్ కుమార్.. జగదీష్ పలనీస్వామిలు 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్లో నిర్మించారు. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను సమర్పించనుంది. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేసింది.

    అక్టోబర్ నెలలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ పోటీలో ఉన్నాయి. ‘లియో’కు ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఉండటంతో నిర్మాతలు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. 40 రోజుల ముందు నుంచి లియో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ స్టాట్ చేయడం ద్వారా ఆడియన్స్ ను తమవైపు తిప్పుకోనున్నారు.

    ట్విస్ట్ ఏంటంటే గత 24 గంటల్లో 10వేల అడ్వాన్స్ టికెట్స్ అమ్ముడుపోయాయి. దీన్ని యూఎస్ సహా తదితర దేశాల్లో పంపిణీ చేస్తున్న అహింస ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. ఇకపోతే రజనీకాంత్ ‘జైలర్’ రికార్డులను బద్దలు కొట్టే సినిమా ‘లియో’ మాత్రమే కానుందని విజయ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మరియు కలెక్షన్లలో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందనే ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనా ‘లియో’ మాస్టర్ ప్లాన్ వేరే లెవల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘Leo’ : ‘లియో’ చివరి 20 నిమిషాలు అరాచకమే! లీక్ అయినట్లు టాక్!

    'Leo' : లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లియో’. ఈ...

    Horoscope : నేటి రాశి ఫలితాలు

    Horoscope మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనుల్లో పురోగతి ఉంటుంది....

    ఇళయ దళపతి  విజయ్ చిత్రానికి 400 కోట్ల బిజినెస్ ?

    ఇళయ దళపతి విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం '' లియో ''....

    విజయ్ లియో చిత్రంలో చరణ్ ?

    ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం '' లియో...