28.5 C
India
Sunday, May 19, 2024
More

    Komatireddy Fire : ఇదేం ఫైరింగ్ కోమటిరెడ్డి.. బానిసలు ఎవరో చెప్పాలంటూ కేటీఆర్ పై అటాక్.. 

    Date:

    Komatireddy Fire
    Komatireddy Fire on KTR

    Komatireddy Fire : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి ఒక్కసారిగి ఫైర్ అయ్యారు. ఇంతక ముందెన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎవర్రా బానిసలంటూ ఊగిపోయారు. బీఆర్ఎస్ లో వేరేవాళ్లు సీఎం అవుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైల్ అవుతున్నాయి.
    ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ పేరుతో కేటీఆర్ లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానుకోవాలని.. సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పైనా నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు హితవు పలికారు.
    ”నాడు సోనియాతో గ్రూప్ ఫొటో కూడా దిగినవ్ కదా కేటీఆర్. ఇంకోసారి సోనియాపై మాట్లాడితే పాపం తగులుతుంది. కేటీఆర్.. రాజకీయాల్లో నీకేం అనుభవం ఉంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. రెండో దశ ప్రారంభం కాగానే వచ్చావు. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ రాలేదని కేటీఆర్ తెలుసుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

    ” కేటీఆర్ కి కొంత నాలెడ్జ్ ఉంది అనుకున్న. ఈరోజు చిట్ చాట్ తర్వాత కేటీఆర్ కి ఏమీ తెలియదని అర్థమైందని ఎద్దేవా చేశారు.  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కేవలం ఒక శాతం మాత్రమే. రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి కేటీఆర్. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ బయటకి వచ్చి పార్టీ పెట్టారు. రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మేం తెలంగాణ కోసం కొట్లాడాము. అని చెప్పుకొచ్చాడు.
    కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలి. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చారు. సోనియా, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకటో తారీఖున పింఛన్లు వచ్చేవి. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందో చెప్పాలి. ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు.

    పార్లమెంటులో కేసీఆర్ ఒక్కసారైనా తెలంగాణ కోసం మాట్లాడారా? కేబినెట్ మంత్రుల్లో చాలామంది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లే. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్ కుటుంబం సోనియాని ఎందుకు కలిసింది? ఎందుకు గ్రూప్ ఫోటో దిగింది. మహమూద్ అలీ, పద్మా దేవేందర్ రెడ్డిలను బానిసల్లా చూసింది కేసీఆరే. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా?
    కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ లో అలా కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్షు ముఖ్యమంత్రి అవుతాడు. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్.. అమిత్ షాకి చెప్పి వచ్చారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? దళితబంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నా” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
    సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఉద్యమ సమయంలో ఆయన్ను బండ బూతులు తిట్టిన దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని నియంతలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికి కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చి పంపారని అన్నారు. కేటీఆర్ రాజకీయాలపై అనుభవం లేని వ్యక్తి విమర్శించారు.   తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కేవలం సీఎంకు దట్టీలు కట్టడానికే పనికొస్తాడని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని అన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...