37.8 C
India
Saturday, May 18, 2024
More

    Relieve Constipation : మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారాలేవో తెలుసా?

    Date:

    Relieve Constipation
    Relieve Constipation

    Relieve Constipation : మలబద్ధకం సమస్య ఈ రోజుల్లో సహజంగా విస్తరిస్తోంది. దీంతో చాలా రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. మలబద్ధకం సమస్య రాకుండా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఫైబర్ ఎక్కువగా కూరగాయల్లో ఉంటుంది. దీంతో వాటిని ఎక్కువగా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    మన ఆహారంలో నెయ్యి చేర్చుకుంటే కూడా మలబ్ధకం సమస్య దూరమవుతుంది. ఇందులో ఉండే బ్యూటిరేట్ కంటెంట్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇంకా రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రోజు మన ఆహారంలో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే ఉపశమనం లభించడం ఖాయమని చెబుతుంటారు.

    ఉసిరికాయ కూడా పోషకాల గని. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం రాకుండా చేస్తుంది. ఉసిరి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. దీంతో దీన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఆపిల్ జ్యూస్ కూడా మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ, కె వంటి వాటి వల్ల మలబద్ధకం నివారించబడుతుంది.

    మలబద్ధకం సమస్యకు పాలు కూడా పరిష్కారం చూపుతాయి. రోజు పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చని పాలు గ్లాసు తాగడం వల్ల ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఇలా మనం తీసుకునే ఆహారాల్లో మార్పులు చేసుకుంటే మనకు ఎంతో లాభం కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు పాటించి మనకు అవసరమయ్యే వాటిని తీసుకుంటే ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...