36.9 C
India
Monday, May 13, 2024
More

    MAD Movie Review : ‘మ్యాడ్’ మూవీ ఎలా ఉంది.. యూత్ ను ఆకట్టుకుందా?

    Date:

    MAD Movie Review :
    నటీనటులు :
    సంగీత్ శోభన్
    నార్నే నితిన్
    రామ్ నితిన్
    శ్రీ గౌరీ ప్రియా రెడ్డి
    అనంతిక సనీల్ కుమార్
    గోపికా ఉద్యాన్
    విష్ణు
    రఘు బాబు
    అనుదీప్ కేవీ
    ఆంథోనీ తదితరులు..
    డైరెక్టర్ : కళ్యాణ్ శంకర్
    నిర్మాత : హారిక సూర్యదేవర
    మ్యూజిక్ : భీమ్స్ సిసిరోలియా
    రీజనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ లో మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత శోభన్) ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఎదురైనా ర్యాగింగ్, కాలేజ్ క్యాంటీన్ కోసం ఛాలెంజ్ వంటి అంశాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండగా వారి జీవితాల్లోకి తమ క్లాస్ మేట్స్ వస్తారు.. మరి ఇంజినీరింగ్ ముగిసే సమయానికి వారి జీవితాల్లో జరిగిన సుఖదుఃఖాలను ఈ సినిమా కథగా చూపించారు..
    ఇక ఈ సినిమా మొత్తం ఫుల్ ఫన్ తో ముగుస్తుంది.. లవ్ ట్రాక్స్, క్లైమాక్స్ లలో కొన్ని కొన్ని ట్విస్టులతో ఈ సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.. కాలేజ్ ప్రెషర్స్ పార్టీలో జరిగే సమయంలో చోటు చేసుకున్న ఒక సంఘటన నేపథ్యంలో సీనియర్ విద్యార్థి ఈ కథను చెప్పడంతో స్టార్ట్ అయ్యి అనేక ట్విస్టులతో ఫినిష్ చేస్తారు.
    డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ విద్యార్థుల చుట్టూ తిరిగే సంఘటనల ఆధారంగా కథకు తగినట్టుగా వినోదాన్ని క్రియేట్ చేసేలా అడల్ట్ డైలాగ్స్ తో కథ నడిపిస్తాడు. ఈయన రాసుకున్న డైలాగ్స్ తో పాటు సీన్స్ కూడా వర్కౌట్ అవ్వడంతో యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక వినోదం అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోగా లాజిక్స్ తో పనిలేకుండా చెప్పిన డైలాగ్స్, సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో మ్యాడ్ మూవీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి.
    ఇక నటీనటులంతా కొత్తవారైనా కూడా అద్భుతంగా నటించి ప్రతీ సీన్స్ ను రక్తికట్టించేలా పండించారు.. కమెడియన్ విష్ణు, సంగీత్ శోభన్ సినిమా భారాన్ని మొత్తం తమ భుజస్కంధాలపై మోశారు అనే చెప్పాలి. రామ్ నితిన్, నార్నే నితిన్ సినిమాకు ప్లస్ గా నిలిచారు. అలాగే హీరోయిన్స్ శ్రీ గౌరీ ప్రియా, అనంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యాన్ తమ అందం, అభినయంతో మెప్పించారు..
    మ్యాడ్ సాంకేతిక వర్గం కూడా బాగా పని చేసారు.. భీమ్స్ సిసిరోలియా మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.. ఈయన పాటలు మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలంగా మారింది.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
    మొత్తంగా ఈ సినిమా యూత్ ఫుల్ గా సాగే కామెడీ డ్రామా.. లాజిక్స్ లేకుండా చుస్తే ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది.. అందరు కొత్తవారే అయినా ఈ సినిమా చూస్తుంటే అలా అనిపించదు.. సినిమాను వీరంతా నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లారు..

    Share post:

    More like this
    Related

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related