28.5 C
India
Sunday, May 19, 2024
More

    Team India Player : వరల్డ్ కప్ లో టీమిండియాకు బిగ్ షాక్.. ఆసుపత్రిలో ఆ ఆటగాడు..

    Date:

    Team India Player
    Team India Player Gil

    Team India Player : వరల్డ్ కప్-2023లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా అలవోకగా గెలిచింది. ఈ విజయంతో టీమ్ ఇండియా ఫుల్ జోష్ గా కనిపిస్తుంది. కానీ ఈ సమయంలోనే ఒక చేదు వార్త ఎదురైంది. జట్టులో కీలక ఆటగాడు తర్వాత రెండు మ్యాచ్ లు ఆడలేడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11వ తేదీ (బుధవారం) అఫ్గనిస్తాన్ తో, 14వ తేదీ (శనివారం) పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లకు జట్టులో కీలకమైన ఆటగాడు శుభ్ మన్ గిల్ దూరం అవుతున్నట్లు చెప్పాడు.

    శుభమన్ గిల్ కు డెంగ్యూ ఫీవర్ అటాక్ అయ్యింది. దీంతో ఆయన కొన్ని రోజులుగా ఇబ్బంది అనారోగ్యంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆడాల్సిన సమయంలో ఆయన రాలేదు. ఆ తర్వాత ఆఫ్గనిస్తాన్ తో కూడా ఆడలేడని ప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ తో కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. డెంగ్యూ ఫీవర్ వల్ల ప్లేట్ లెట్స్ తగ్గి నీరసించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన పాక్ తో తలపడడం అనేది అసంభవమనే చెప్పాలి. అందు కోసం శుభమన్ గిల్ స్థానాన్ని ఇషాన్ కిషన్ తో రిప్లేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఈ మూడు మ్యాచ్ లు మినహాయిస్తే వరల్డ్ కప్ లో ఆయన మిగతా మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫీవర్ తో ప్లేట్ లెట్లు పడిపోవడం వల్ల ఆయన చాలా నీరసించాడని కొంత కాలం విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. టీములో ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేసే ప్లేయర్ లేకపోయినా ఆల్టర్ నేట్ ప్లేమర్ గా మాత్రం ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ను శుభమన్ గిల్ కాన్‌స్టెంట్ గా ఆడుతాడు. కాబట్టి కోహ్లీకి గిల్ తోడైతే స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. గిల్ ఉంటేనే బాగుంటుందని సదరు క్రికెట్ అభిమానులు, ఇండియన్స్ బాగా కోరుకుంటున్నారు.

    ముఖ్యంగా పాక్ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం భారత్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ మూడు మ్యాచ్ లకు దూరం అవుతున్నారని తెలిసినా.. తర్వాతి మ్యాచ్ లకు అయినా అందుబాటులోకి వస్తారని నేషనల్ మీడియా చెప్తుండడంతో ఇండియన్స్ కొంతలో కొంత ఆనందంగా ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB : ఆర్సీబీ ఫ్లే ఆప్స్ కు వెళ్లే అవకాశముందా?

    RCB : ఆర్సీబీ అంటేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం....

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ ఓపెనర్లు వీరే..

    T20 World Cup Openers : ఐసీసీ టీ20 ప్రపంచ కప్...

    Yusuf Pathan : MP గా పోటీ చేయనున్న యూసుఫ్ పఠాన్..

    Yusuf Pathan : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్...

    Yuzvendra Chahal : బక్క పల్చని చాహల్‌ను ఎత్తి గిరగిరా తిప్పిన మహిళా రెజ్లర్.. 

    Yuzvendra Chahal : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన ఓ...