31 C
India
Monday, April 29, 2024
More

    Yuzvendra Chahal : బక్క పల్చని చాహల్‌ను ఎత్తి గిరగిరా తిప్పిన మహిళా రెజ్లర్.. 

    Date:

    Yuzvebdra Chahal
    Yuzvendra Chahal

    Yuzvendra Chahal : టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందులో భారత రెజ్లర్ సంగీత ఫొగట్ అతడిని అమాంతం భుజాలపై ఎత్తుకున్న తిప్పినట్లు కనిపించింది. ఇందులో నన్ను దింపేయ్ తల్లి కళ్లు తిరుగుతున్నాయ్ అని చాహల్ వేడుకుంటున్నట్లుగా ఉంది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

    టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ క్రికెట్‌లోనే కాకుండా ఇతర కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడు. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి రీల్స్ చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. తాజాగా అతడికి చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    అందులో భారత స్టార్ రెజ్లర్ సంగీత ఫొగ‌ట్.. బక్క పల్చగా కాస్త ఎత్తు తక్కువగా ఉండే చాహల్‌ను అమాంతం ఎత్తింది. సంగీత ఫొగట్ ఎవరో కాదు.. ప్రముక రెజ్లర్ భ‌జ్‌రంగ్ పూనియా భార్యే.

    యుజ్వేంద్ర చాహల్, రెజ్లర్ సంగీత ఫొగట్‌లు ఇటీవల ఓ పార్టీలో కలుసుకున్నారు. “ఝ‌ల‌క్ దిక్‌లాజా డాన్స్ షో” వీరిద్దరూ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఏం జరిగిందో తెలీదు కానీ.. సంగీత ఫొగట్ అమాతం చాహల్‌ను భుజాలపై ఎత్తుకుని గిరగిరా రెండు మూడు రౌండ్లు గాల్లో తిప్పేసింది. అందులో “నన్ను వదిలేయ్ తల్లీ నాకు తల తిరుగుతోంది” అని చాహల్ సంగీతను సరదాగా అభ్యర్థించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    కాగా చాహల్ భార్య ధనశ్రీ వర్మ మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. ధనశ్రీ ఝ‌ల‌క్ దిక్‌లాజా డాన్స్ షో 11వ ఎడిష‌న్ ఫైన‌ల్ చేరింది. టైటిల్ పోరుకు ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు అర్హ‌త సాధించారు. దీంతో షోకి వచ్చిన చాహల్.. తన సతీమణి ధనశ్రీకి ఓటు వేయాలని ప్రేక్షకులను కోరాడు.

    ఇక చాహల్ విషయానికి వస్తే గత కొంత కాలంగా ఈ స్పిన్నర్ అంత‌ర్జాతీయ‌ క్రికెట్‌కు దూర‌మయ్యా డు. ఈ నేపథ్యంలో ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో కూడా చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతు న్న ఈ స్పిన్నర్.. ఈ సీజన్‌లో సత్తా చాటి తిరిగి అంతర్జాతీయ జట్టులోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ప్రారంభం కానుంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Yusuf Pathan : MP గా పోటీ చేయనున్న యూసుఫ్ పఠాన్..

    Yusuf Pathan : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్...

    Jasprit Bumrah : చరిత్ర లిఖించిన బుమ్రా.. 150 వికెట్ల మైలురాయి అందుకున్న ఆటగాడు

    Jasprit Bumrah : టీమిండియా స్టార్ పేసర్ జన్ ప్రీత్ బుమ్రా...

    Team India Player : వరల్డ్ కప్ లో టీమిండియాకు బిగ్ షాక్.. ఆసుపత్రిలో ఆ ఆటగాడు..

    Team India Player : వరల్డ్ కప్-2023లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియాతో...

    Virat Kohli : బ్రేక్ తీసుకొని ముంబైకి చేరుకున్న విరాట్.. కారణమదేనా..?

    Virat Kohli : ప్రపంచకప్ కు టీమిండియా సిద్ధమైంది. ఇక మూడు రోజుల్లో...