
RCB : ఆర్సీబీ అంటేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న టీం. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అందరూ ఫామ్ కోల్పోవడం వారిని భారీగా పరుగులు సమర్పించేలా చేస్తోంది. ఆర్సీబీ బ్యాటింగ్ లో విరాట్ కొహ్లి ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. మిగతా బ్యాటర్లందరూ సరైన ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్సీబీ ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడి కేవలం 1 మ్యాచ్ లోనే ఓడిపోయింది. మిగతా ఆరు మ్యాచ్ లు గెలిచినా ఆ జట్టుకు మొత్తం 14 పాయింట్లు వస్తాయి. అవి కూడా భారీ మార్జిన్ తో గెలవాలి. అయితే ఆర్సీబీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మ్యాచ్ లను గెలవడం అసాధ్యమనే అనిపిస్తోంది. ఒకవేళ అన్ని మ్యాచ్ లు గెలిచి 14 పాయింట్లతో ఉంటే మిగతా టీంలు ఆర్సీబీ కంటే నెట్ రన్ రేట్ లో తక్కువగా ఉండాలి.
ముఖ్యంగా మిగతా టీంల గెలుపొటముల మీద ఆధారపడి ఆర్సీబీ ఫ్లేఆప్స్ కు వెళ్లే అవకాశముంటుంది. ఏదైనా నాలుగు జట్లు 16 పాయింట్లు సాధిస్తే ఇక ఆర్సీబీ పని అయిపోయినట్లే ఎందుకంటే ఆ అవకాశాలు మిగతా జట్లకు మెరుగ్గా ఉన్నాయి. ఆరు జట్లు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు గెలిచి ఇంకా ఆరు నుంచి ఏడు మ్యాచ్ లు ఆడనున్నాయి.
పాయింట్స్ టేబుల్స్ లో రాజస్థాన్ 7 మ్యాచ్ ల్లో ఆరు విజయాలతో ప్లే ఆప్స్ కు దగ్గర కాగా.. కోల్ కతా, హైదరాబాద్ అయిదు విజయాలతో 10 పాయింట్లతో ప్లేఆప్ రేసులో ఉన్నాయి. చెన్నై, లక్నో, గుజరాత్ నాలుగు విజయాలతో 8 పాయింట్లలో నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ఆర్సీబీ ప్లే ఆప్స్ కు వెళ్లడం కష్టం. వర్షాలు పడో.. మ్యాచ్ రద్దయి మిగతా టీం పాయింట్లలో కోత పడి.. అదే సమయంలో ఆర్సీబీ అన్ని మ్యాచ్ లు మంచి రన్ రేట్ తో గెలిస్తేనే ప్లే ఆప్స్ కు వెళ్లడం సాధ్యమవుతుంది. లేకపోతే ఈ సారి కూడా ఈ సాలా కప్ నామ్ దే అనే కల కలగానే మిగిలిపోతుంది.