26.7 C
India
Saturday, June 29, 2024
More

    AP With Full Of Debts : అప్పుల కుప్పగా ఏపీ

    Date:

    AP With Full Of Debts
    AP With Full Of Debts
    AP With Full Of Debts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. సీఎం జగన్ మతిలేని ఆలోచనలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. నెల తిరిగితే కేంద్ర వద్ద, ఆర్బీఐ దగ్గర చేతులు చాచకుంటే ముందుకు కదల్లేని పరిస్థితికి ఏపీ చేరుకుంది.
    దేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం మీద 20 శాతానికన్నా ఎక్కువ ప్రజల్ని పోషిస్తున్న పెద్ద రాష్ర్టం యూపీ ఉంది. ఆర్థికంగా బలమైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , గుజరాత్ వంటి రాష్ట్రాలూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా.. ఒక్క ఏపీకి మాత్రం ఇబ్బడిమబ్బడిగా అప్పులు ఇచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఇలా ఇవ్వడం లేదు. ఏ ప్రాతిపదిన ఇస్తున్నారో కూడా కేంద్రం స్పష్టతనివ్వడం లేదు. అప్పుల పేరుతో దేశ ప్రజల సొమ్ము ఏపీని నాశనం చేయడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
    నైజ లక్ష  ఆదాయం వస్తే.. మరో లక్ష రూపాయల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏపీలో దాపురించింది. అయితే ఏపీ సర్కార్ కు మాత్రం లక్ష రూపాయల ఆదాయం ఉంటే రూ. 2 లక్షల అప్పు ఇచ్చేందుకు ఆర్బీఐ ఎప్పుడూ  రెడీగా ఉంది. ఏడాది మొత్తం మీద 43వేల కోట్లు అప్పు చేస్తామని బడ్దెట్‌లో పెట్టి… నాలుగు నెలలకే మొత్తం చేసేసినా.. ప్రతీ వారం రెండు వేల కోట్లు అప్పు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క ఆర్బీఐ దగ్గర చేసే అప్పే లక్ష కోట్లు ఉంటుందని అంచనా. కార్పొరేషన్ల అప్పులు మరో యాభై వేల కోట్లు అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంతా చేసి ఏపీ సొంత ఆదాయం 90వేల కోట్లు ఉంటుంది. ఇందులో మద్యం వాటా పాతిక వేల కోట్లు.
    ఇతర రాష్ట్రాలు ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకోవాలంటే ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు అడ్డు వస్తాయి. ప్రోగ్రెసివ్ స్టేట్ అయిన కేరళకు ఏడాది మొత్తం ఆర్బీఐ ఇచ్చే అప్పు రూ. 17వేల కోట్లు మాత్రమే. కానీ ఏపీ ఒక్క నెలలో ఆ అప్పు చేస్తుంది. ఎప్పుడూ ఓడీలో ఉంటుంది. రేపు మంగళవారం మరోసారి రెండువేల కోట్లు అప్పు తెస్తున్నారు. అది ఓడీకి సరిపోతుంది. మళ్లీ ఓడీ తీసుకుంటారు. మళ్లీ మంగళవారం అప్పు తీసుకుని ఓడీని సర్దుబాటు చేస్తారు. ఓ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగిపోయేలా చేయడానికి ఇలా కేంద్రం సహకరించడం చరిత్రలో ఉండదు. ఇది ఏపీ ప్రజల చేసుకున్న దురదృష్టం కావొచ్చు.

    Share post:

    More like this
    Related

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    Ketika Sharma : కేతికా శర్మ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో రచ్చ 

    Ketika Sharma : కేతికా శర్మ తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీ లో ఎన్ని...

    Prabhas : ఇండియన్ సిల్వర్ స్ర్కీన్ పై ప్రభాస్ సరికొత్త రికార్డు

    Prabhas : ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crisil Bankruptcy Certificate AP : ఆంధ్రప్రదేశ్ కు దివాలా సర్టిఫికెట్.. రెడీ చేసిన క్రిసిల్!

    Crisil Bankruptcy Certificate AP : ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తుందా? అంటే...

    Big Day For Chandrababu : చంద్రబాబుకు బిగ్ డే.. నేడు కీలక తీర్పు.. విచారణలు

    Big Day For Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు  ఈ...

    Ultimatum To Jagan Government : పేర్లు మార్చితే నిధులివ్వం.. జగన్ సర్కారుకు కేంద్రం ఆల్టిమేటం

    Ultimatum To Jagan Government : కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు...