32.6 C
India
Saturday, May 18, 2024
More

    KCRs BRS or TRS : ఇంతకీ బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా.. కేసీఆర్ ఏం చెబుతున్నారు..

    Date:

     

     

    KCRs BRS or TRS
    KCRs BRS or TRS

    KCRs BRS or TRS : తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్ని సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తున్నది. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కొంత అచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్గా మార్చాక గడ్డు పరిస్థితులు ఎదురరవుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ తో ఇన్నాళ్లూ నెగ్గుకొచ్చిన ఆయన, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ అంటూ పార్టీ పేరును మార్చేశారు.

    ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలే రాష్ర్టానికి రక్ష అంటూ కొత్త పాట ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ అంటూ మహారాష్ర్టతో పాటు పలు రాష్ర్టాల్లో గతంలో ఆయన హడావిడి చేశారు. ఆయా రాష్ర్టాలకు పార్టీ ల ఇన్ చార్జిలను కూడా ప్రకటించారు.  ఇప్పుడు సొంత రాష్ర్టంలో నే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ధీంతో పాటు ప్రస్తుతం ఆయన కు కొన్ని పరిస్థితులు కలిసిరావడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి సెంటిమెంట్ ను రగిల్చే పనిలో పడ్డారు.  ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అంటూ మరోసారి మొదలుపెట్టారు. ఇప్పటికీ తెలంగాణ వాదాన్నే వినిపిస్తున్నానని చెప్పుకుంటున్నారు.

    పార్టీ పేరులోనే తెలంగాణ అనే పదాన్ని తీసేసి, ఇప్పుడు తెలంగాణ వాదం అంటే ఎలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు.  తెలంగాణలో మారుతున్న పవనాలను ఆయన గుర్తించారు. కాంగ్రెస్ కు షర్మిల, చంద్రబాబు సహకరిస్తున్నారని అటు శ్రేణులు కూడా మరోసారి ప్రచారం మొదలుపెట్టాయి. ఏపీ రాజకీయాలు మనకెందుకని, ఢిల్లీ పెత్తనాలు మనకెందుకని ఆయన ప్రసంగాల్లో చెబుతున్నారు. ప్రజలను ఆలోచించాలని కోరతున్నారు. కానీ ఆయన మాత్రం ఏపీ, ఢిల్లీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఇప్పుడు పోటీ చేస్తు్న్నది బీఆర్ఎస్సా.. టీఆర్ఎస్సా చెప్పలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2023 Roundup : అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమా?

    2023 Roundup : ‘‘మూడోసారి పక్కా’’ అని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు,...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    Telangana Polling : నెమ్మదిగా ప్రారంభం, నెమ్మదిగా పుంజుకుంటుంది!

    Telangana Polling : తెలంగాణ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ...