
Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసి చెబుతాయి. ఎన్నికలు పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తాయి. ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో కచ్చితంగా అంచనా వేసి చెబుతయి.
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ఎగ్జిట్ పోల్స్ చెప్పే లెక్కలు ఎంతవరకు నిజం అవుతాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలు పూర్తిగా నమ్మదగినది కానప్పటికి ఎన్నికలకు సంబంధించిన అంశాల గురించి అంచనా వేస్తాయి. ఎన్నికలు అయ్యాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటిస్తుంటాయి. ఇవి కచ్చితంగా దాదాపుగా నిజం అవుతాయి.
వీరు ఎగ్జిట్ పోల్స్ ఎలా లెక్కకడతారంటే ఓటర్లను ర్యాండమ్ గా గుర్తించి ప్రీపోల్స్ నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లను కలుపుకుని ఏ అభ్యర్థి నిలబడతాడు? పార్టీకి విన్నింగ్ చాన్స్ ఎంత మేరకు ఉందనే విషయాన్ని సేకరించి లెక్కిస్తారు. పోలింగ్ రోజు ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నాడీ తెలుసుకుని అంచనా వేస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో లెక్కిస్తారు.
ప్రీపోల్ సర్వేలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, దివ్యాంగులు, ముసలివారు, మహిళలు, కులం, మతం, పేద, మధ్యతరగతి వంటి వర్గాలను ఎంచుకుని సర్వే నిర్వహిస్తారు. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు పోలింగ్ రోజే ఓటు వేసేందుకు వచ్చిన వారిని మాత్రమే ప్రశ్నించి సమాధానం రాబడతారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా కరెక్ట్ గానే ఉంటాయి.