37.7 C
India
Saturday, May 18, 2024
More

    Weddings From November : నవంబర్ 23 నుంచి పెళ్లిసందళ్లు.. ఎన్ని లక్షల వివాహాలో తెలుసా?

    Date:

    Weddings From November
    Weddings From November

    Weddings From November : దేశంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మంచి రోజులు రావడంతో పెళ్లి సందళ్లు షురూ కానున్నాయి. నవంబర్ 23 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో వ్యాపారాలు ముమ్మరంగా ముందుకు వెళ్లనున్నాయి. ఫంక్షన్ హాల్స్, బంగారం, ఇతర వస్తువుల దుకాణాలు సందడి చేయనున్నాయి. వ్యాపారం మూడు పువ్లులు ఆరు కాయలుగా మారనున్నాయి.

    వ్యాపార రంగంలో రూ. 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే సూచనలున్నాయి. గత ఏడాది దాదాపు 32 లక్షల పె ళ్లిళ్లు జరగ్గా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే పెళ్లిళ్లు నవంబర్ 23 నుంచి మొదలవనున్నాయి. తిథి, నక్షత్రాల ప్రకారం నవంబర్ 23,24,27,28,29 తేదీల్లో ముహూర్తాలు బాగున్నాయి. ఇంకా డిసెంబర్ నెలలో 3,4,7,8,9 తోపాటు 15వ తేదీ కూడా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి.

    వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ప్రముఖ వ్యాపార సంస్థలు, వస్తువులు అందించే దుకాణాలు పెళ్లిళ్ల సందడితో వ్యాపారాలు ముమ్మరం చేయనున్నాయి. 38 లక్షల వివాహాలు ఉండటంతో మంచి వ్యాపారాలు కొనసాగేలా ఉన్నాయని చెబుతున్నారు. శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందళ్లు కనువిందు చేయనున్నాయి. కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి.

    పురోహితులు, క్యాటరింగ్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో పెళ్లిళ్లు ఉండటంతో అందరిలో ఉత్సాహం నెలకొనడం ఖాయం. ఈనేపథ్యంలో పెళ్లి ముహూర్తాలు అందరికి పండగ వాతావరణం కల్పించనున్నాయి. ఇన్నాళ్లు పని లేని వారికి కూడా పని దొరకనుంది. బంగారం వ్యాపారులు కూడా మంచి గిరాకీ రానుంది.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagtial News : పెళ్లి లో  మటన్ కోసం గొడవ.. తీవ్ర గాయాలు..

    Jagtial News : ఆనందంగా జరుగుతున్న వివాహ వేడుకలో మటన్ ముక్క...

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

      Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది....

    Crime News : కొన్ని గంటల్లో.. వరుడి పెళ్లి కత్తి తో పొడచి చంపిన తండ్రి..

    Crime News : ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ట్రైనర్ గౌరవ్...

    Tragedy : పెళ్ళిలో విషాదం.. DJ కు డాన్స్ చేస్తూ బాలుడు మృతి

    Tragedy in Wedding : యూపీలో ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసు...