Crime News : ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ కు మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉంది. బంధువులు ఊరేగింపు నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమ యంలో సింఘాల్ కు తన తండ్రితో గొడవ జరిగింది.
ఆవేశంలో అతడిని తండ్రి రంగలాల్ 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. బంధువులు ఊరే గింపు కోసం వరుడు కోసం వెతకగా వరుడు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ కు గురయ్యారు. నిం దితుడు రంగలాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొన్ని గంటలు కలిస్తే వివాహం పూర్తి అవుతుంది. ఇలాంటి సందర్భంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవ కారణం గా తండ్రి క్షణికావేశంలో కొడు కును చంపడంతో పెళ్లి కి వచ్చిన వారు అంతా షాక్ కు గురయ్యారు.