36.7 C
India
Thursday, May 16, 2024
More

    KOLLA ASHOK BABU: చేసింది గోరంత. చేయాల్సింది కొండంత – మీడియాతో కొల్లా అశోక్‌బాబు

    Date:

    తానా పేరిట తాను చేసిన సేవా, సహాయ కార్యక్రమాలు గోరంతేనని…చేయవల్సింది కొండంత మిగిలి ఉందని ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంకు చెందిన ప్రవాసాంధ్రుడు తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు.  సంస్థ పరిధి, శక్తిసామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించబడట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతిరోజు పొలం పనులకు వెళ్లే రైతాంగ కుటుంబం నుండి వచ్చిన తనకు కష్టించి పనిచేయడం, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేయడం ఆనందం ఇస్తుందని అశోక్ అన్నారు. తానా సభ్యులకు వివాహ సంబంధ సేవలు, ప్రవాస తెలుగు పర్యాటకులకు బీమా సౌకర్యం, తానా సభ్యులకు అమెరికావ్యాప్తంగా పలు వ్యాపార సంస్థల్లో రాయితీ సౌలభ్యం, ప్రవాస యువతీయువకులకు విద్యాపరమైన సేవలు, మాతృదేశంలో శాశ్వత సేవా కార్యక్రమాల నిర్వహణకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. విజణ్ తానా  లక్ష్యంలో భాగంగా తానాకు పలు అంతర్జాతీయ సంస్థలకు మధ్య ఒప్పందాలు కుదుర్చుకుని భావితరాల వారికి ఉపయుక్తమయ్యే కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.

    సేవా కార్యక్రమాల నిర్వహణలో ఉండాల్సిన పోటీ కోర్టు కేసుల్లో కనపడటం లేదని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి కష్టార్జితం మరొకరి బాగుకోసం వెచ్చించాల్సిన బరువైన బాధ్యత కలిగిన తానా కోశాధికారిగా తాను సమర్థవంతంగా పనిచేశానని వెల్లడించారు. తానా ఖజానా కొందరికి బంగారు బాతుగా మారిందని…కల్తీ లెక్కలు, నకిలీ పత్రాలతో చెదపురుగుల మాదిరి లోపల నుండి సంస్థ నిధులు మింగిన వారందరి నుండి ప్రతిపైసా తిరిగి రప్పిస్తామని…ఇప్పటికే ఈ లక్ష్యం తొలివిజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు.

    అమెరికాలో దురదృష్టమో, దుర్ఘటనో బారిన పడిన ప్రవాస తెలుగువారికి TANA-TEAMSQUARE ద్వారా అశోక్ రూపంలో ఓ ఆశాకిరణం నేనున్నాననే భరోసానిచ్చింది. గడిచిన 14ఏళ్లలో ఆపన్నులకు ఆసరాగా, బాధితులకు బాసటగా, సేవా కార్యక్రమాలకు సదా సంసిద్ధుడిగా పనిచేసిన తనకు తానా ద్వారా మరిన్ని దీర్ఘకాల సమాజాహిత కార్యక్రమాలు నిర్వహించాలనే సదాశయానికి గొడుగు పట్టాలని తానా సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తానా ఓటర్లు తమ ఓటును తనకు, తన ప్యానెల్‌కు అందజేసి 2023 ఎన్నికల్లో గెలిపించవల్సిందిగా కోరారు.

     

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త...

    Tana President: తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి గెలపు

      తానా  అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్...

    TANA E-Voting : తానా E-Votingలో ఏం జరుగుతుంది?

    TANA E-Voting : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 46...