17.1 C
India
Sunday, December 7, 2025
More

    TANA Foundation : తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి.

    Date:

    TANA Foundation
    TANA Foundation

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి (sasikanth vallepally), సెక్రటరీగా విద్యాధర్‌ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్‌ మద్దినేని, జాయింట్‌ ట్రెజరర్‌గా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు. తానాలో శశికాంత్‌ వల్లేపల్లి తొలి నుంచి దాతగా పేరు తెచ్చుకున్నారు.

    తానా ద్వారా చాలా మందికి సాయం చేశారు. పలు ప్రాజెక్టులకు ఫండింగ్‌ చేస్తున్నారు. అంకిత భావం, అందరితో కలిసిపోయే స్వభావం కలిగిన శశికాంత్‌ వల్లేపల్లి, కాంత్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్య క్రమాలు చేపట్టారు. వేలాది మంది విద్యార్థుల చదువు కోసం తానా ఫౌండేషన్‌ చేయూత కార్య క్రమం కోఆర్డినేటర్‌గా సేవలు అందించారు. శశికాం త్ వల్లేపల్లి తానా ఫౌండేషన్‌ ట్రెజరర్‌, కార్యదర్శిగా పనిచేశారు.

    సేవా కార్యక్రమాలు..

    తానా ద్వారా సహాయం అందించే వారిలో మరొక రు విద్య గారపాటి. సేవ చేయాలనే సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి సేవలు అందిస్తున్నారు. తన సొంత నిధుల నుంచి 75,000,00 డాలర్లను సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. అమెరికాలో తానా, నాటా, నాట్స్‌, టిటిఎ లాంటి తెలుగు సంఘాలు నిర్వహించే మహాసభలకు వచ్చేవారి కోసం మంచినీటి బాటిళ్ళను అందజేస్తుంటారు.

    ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా మహాసభల్లో 70 వేల వాటర్‌ బాటిళ్ళను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌‌తో కలిసి తానా ద్వారా క్యాన్సర్‌ నిర్దారణ శిబిరాలను నిర్వహించారు. తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్‌గా, న్యూజెర్సీ రీజియన్‌కు రీజనల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.

    తొలి నుంచి తానాలో సభ్యుడిగా

    తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఇతర కమిటీల్లో వినయ్‌ మద్దినేని పని చేశారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా (తామా)కి అధ్యక్షుడిగా, బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్‌కి ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. తానాలో కిరణ్‌ గోగినేని వివిధ పదవులు చేపట్టారు. అట్లాంటాకు చెందిన ఆయన 2019-2021 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలు అందించారు. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా), ఇండియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ అట్లాంటా తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఫౌండేషన్‌ జాయింట్‌ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    TANA : ఢిల్లీలో తానా నాయకులు..కేంద్రమంత్రులు ఎంపిలతో భేటీ

    TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు నోవైలో జూలై...

    skater Tara Prasad : భారతీయ-అమెరికన్ స్కేటర్ తారా ప్రసాద్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా

    Skater Tara Prasad : మహీంద్రా కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త...