30 C
India
Wednesday, May 15, 2024
More

    Jai Swarajya TV Poll : జైస్వరాజ్య టీవీ పోల్ : లోకేష్ పాదయాత్రతో టీడీపీకి అధికారం సాధ్యమేనా?

    Date:

    Jai Swarajya TV Poll
    Jai Swarajya TV Poll

    Jai Swarajya TV Poll : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేల సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత టీడీపీకి మరింత ప్రజాధరణ పెరిగిందని తెలుస్తోంది. ఇక జనసేన కూడా టీడీపీకి తోడవడంతో ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు ‘యువగళం’ పాదయాత్రను ఆపిన నారా లోకేశ్ తిరిగి ప్రారంభించారు. తన తండ్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్తున్నారు.

    ఏపీ విడిపోయిన తర్వాత సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలకు చెప్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన యువగళం తిరిగి ప్రారంభించే సమయంలో జగన్ ప్రభుత్వం అడ్డుకున్న వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రకు ఆదరణ ఎంత పెరుగుతుందో ఇట్టే తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆయన పాదయాత్ర మాత్రం జోరుగా సాగుతుంది. ప్రజల నుంచి కూడా భారీగా స్పందన వస్తుంది.

    యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ తన స్టయిల్ ను మార్చారు. గతంలో లాగా కాకుండా పంతాను మార్చారు. ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్తున్నారు. ఈ సారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే ఉన్నాడని చెప్తున్న లోకేశ్ పవన్ కళ్యాణ్ కలుపుకొని వెళ్తే రాష్ట్రంలో అధికారం మనదే అంటూ చెప్తున్నారు.

    నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర వల్ల టీడీపీ అధికారంలోకి వస్తుందా? అని జైస్వరాజ్య టీవీ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 73 శాతం మంది వస్తుందని చెప్పగా.. 27 శాతం మంది రాదని చెప్పారు. ఇందులో దాదాపు 127వేల కంటే ఎక్కువ మంది పోల్ లో పాల్గొన్నారు. ఈ సంఖ్యలను చూస్తే ఈ సారి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...