29.5 C
India
Sunday, May 19, 2024
More

    Salaar : ‘సలార్’ మూవీ రివ్యూ : హిట్టా ఫట్టా?

    Date:

    Salaar
    Salaar

    Salaar : నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, సప్తగిరి, బాబీ సింహ, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు

    దర్శకత్వం: ప్రశాంత్ నీల్
    నిర్మాత: విజయ్ కిరంగదూర్
    సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ
    మ్యూజిక్: రవి బస్రూర్
    బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: డిసెంబర్ 22, 2023

    ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ థియేటర్లలోకి రానే వచ్చింది. ఇప్పుడు అందరి ఆసక్తి మూవీ ఎలా ఉంది? ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నట్టేనా? అని. సినిమా ఎలా ఉందో..ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉందో లేదో.. కథలోకి వెళ్దాం..

    దేవా ఆలియాస్ సలార్(ప్రభాస్) అసోంలోని ఓ ప్రాంతంలో బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. ఆ ప్రాంతానికి ఆద్యను(శ్రుతి హాసన్)ను కిడ్నాప్ చేసి తీసుకురావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్ గా పనిచేస్తున్న ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే దేవా కాపాడుతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైనా దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కొంటూ ఆ ప్రాంతానికి వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) వస్తాడు.

    అసోంలో తన తల్లి(ఈశ్వరీరావు)తో కలిసి దేవా ఎందుకు ఉన్నాడు.. ఆ ప్రాంతానికి ఆద్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ అటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది. ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాల్ ఎలా ఎదురైంది. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? ఓటింగ్ సమయంలో దేవాను వెతుక్కుంటూ వరదరాజ మన్నార్ ఎందుకు వచ్చాడు? వరదరాజ తండ్రి రాజమన్నార్(జగపతి బాబు) తన ప్రాంతాన్ని ఎందుకు వదిలి వెళ్లాడు?  యుద్ధ విరమణ ఓటింగ్ టైంలో దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు? ఓటింగ్ లో ఎవరు గెలిచారు? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింక్ ఏమిటి? దేవాకు సలార్ అనే పేరు ఎందుకు పెట్టారు.. అనే ప్రశ్నలకు సమాధానమే సలార్ సినిమా కథ.

    దేవా, వరదరాజ మన్నార్ బాల్యంతో మంచి పవర్ ఫుల్ ఎపిసోడ్ తో సలార్ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అసోంలోని బొగ్గు గనుల్లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆద్య కిడ్నాప్ వ్యవహారం చకచక సాగిపోతాయి. ఫస్ట్ హాఫ్ లో దేవా అండర్ డాగ్ క్యారెక్టర్ నుంచి ఓ నాయకుడిగా ఎస్టాబిష్ చేసిన విధానం ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టిందనే చెప్పాలి. ఇక ఫస్టాఫ్ చివర్లో దేవా లైఫ్ గురించి చెప్పడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది..

    ఇక సెకండాఫ్ లో ఖాన్సార్ అటవీ ప్రాంతం దేశంగా మారడం.. దానికి అధినేతగా మారిన రాజమన్నార్ కొంతమంది సామంతదొరలను నియమించడంతో కథ డీప్ లోకి వెళ్తుంది.. అయితే ఓ పని మీద రాజమన్నార్ దేశం విడిచిపోవడంతో సామంతుల కుట్రలు మొదలవుతాయి. ఖాన్సార్ పీఠం గురించి మొదలైన అంతర్గత కలహాల నేపథ్యంలో వరదరాజ మన్నార్ తో కలిసి దేవా రావడంతో స్టోరీ పీక్స్ కు వెళ్తుంది. సెకండాఫ్ లో కాటేరమ్మ ఎపిసోడ్ లో విష్ణును, ఆయన తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్ లు సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. సెకండాఫ్ లో ప్రభాస్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి.

    ప్రశాంత్ నీల్ మరో వండర్..
    దర్శకుడు ప్రశాంత్ నీల్ తాను అనుకున్నది అనుకున్నట్టుగా కథను తెరపై చూపించాడనే చెప్పాలి. మరోసారి అద్భుతమైన స్క్రిప్ట్ తో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలతో తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది. ప్రభాస్, సుకుమారన్ పాత్రలను మలిచిన విధానం సూపర్. ఈ రెండు పాత్రలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. స్క్రీన్ ప్లే సినిమాను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దింది. కేజీఎఫ్ ను మించి పరిణతి చూపించడనే చెప్పాలి.

    ఛత్రపతి, బహుబలిలను మించి..
    దేవాగా ప్రభాస్ పాత్రను మలిచిన తీరు బాగుంది. ఛత్రపతి, బాహుబలి లను మించిన యాటిట్యూడ్, ఫైర్ ను ప్రదర్శించాడు. ఫస్టాఫ్ లో అండర్ డాగ్ క్యారెక్టర్ లో, సెకండాఫ్ లో ఊహకందని విధంగా మలచడం అద్భుతమే.. ఇక వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ అదరగొట్టాడు. శ్రుతి హాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో నటించింది. జగపతిబాబు, ఈశ్వరీరావు.. బలమైన పాత్రలతో సినిమాకు నిండుతనం తెచ్చారు. వారి కెరీర్ లో గుర్తుంచుకునే పాత్రలవుతాయనే చెప్పాలి.

    టెక్నిషియన్స్ అదుర్స్..
    భువన్ గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ లో రవి బీజీఎం చింపేసింది. ఇక భువన్ గౌడ కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్ సీన్లలో మరింత ఎమోషనల్ గా చూపించాడు. యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించాడు.

    ఇక మైనస్ ల విషయానికొస్తే పెద్దగా లేవనే చెప్పాలి. కాకపోతే సెకండాఫ్ లో మితిమీరిన హింస, రక్తపుటేరులు పారడం కొంత ఇబ్బందిగా ఉంటుంది.  క్లైమాక్స్ సాగదీసి.. సాగదీసి విసుగు తెప్పించేలా చేయడం మైనస్. అయితే కథలోని ఎమోషన్స్ దాన్ని కవర్ చేస్తాయి. యాక్షన్ సీన్లలో ప్రభాస్ ను చూసి తరించాల్సిందే.. ఇవే సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలుపుతాయనడంలో డౌటే అక్కర్లేదు.

    ప్రభాస్ ఫ్యాన్స్ కు బహుబలి తర్వాత ఆ రేంజ్ లో ఎంజాయ్ చేసే సినిమా ఇది. వారికి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఇక వీరంతా పార్ట్-2 కోసం మరింత ఉత్కంఠగా ఎదురుచూడడం ఖాయం.

    రేటింగ్: 3.5/5

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Prashanth Neel : 4 సినిమాలు రూ. 2000 కోట్లు.. నీల్ మామా మజాకా!?

    Prashanth Neel : ఇండియన్ బిగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తుకు...