34.1 C
India
Saturday, May 18, 2024
More

    Salaar Movie First Day Collections : వసూళ్లలో ‘సలార్’ ప్రకంపనలు.. బాక్సాఫీస్‌పై ప్రభాస్ దండయాత్ర..!

    Date:

    • మొదటిరోజు వసూళ్లు చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే!

    Salaar Movie First Day Collections
    Salaar Movie First Day Collections

    Salaar Movie First Day Collections : రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. సోషల్ మీడియాలో కృత్రిమ హైప్, ఎలాంటి హడావుడి లేకుండా రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. కేజీఎఫ్ తర్వాత వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీకి అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్ లో నెల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్ది కలెక్షన్లు ఊపందుకున్నాయి. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.

    ‘సలార్’ మొదటి రోజే ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ మార్క్‌ను సునాయసంగా అధిగమించింది. వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ల ద్వారా 2.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. సలార్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళ్తే.. నార్త్ అమెరికాలో ప్రీమియర్ ప్రదర్శన ముందు వరకు 750k డాలర్లు, యూకేలో 150K డాలర్స్, గల్ఫ్‌లో 50K, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 100K డాలర్లు, ఇతర దేశాల్లో 100K వసూళ్లతో కలిపి మిలియన్ డాలర్లకుపైగా రూ. 8.8 కోట్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

    ఇక, ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. యూఎస్, కెనడాలో 2.6 మిలియన్ డాలర్లు రూ. 21.6 కోట్లు వసూలు చేసింది. యూకే, ఐర్లాండ్ లో 173 ప్రాంతాల్లో రిలీజ్ చేయగా. 165K పౌండ్స్ అంటే రూ. 1.7 కోట్లు, ఆస్ట్రేలియాలో 450K డాలర్లు అంటే రూ. 2.29 కోట్లు, గల్ఫ్ దేశాల్లో రూ. 3.4 కోట్ల వసూలు చేసింది.

    ఓవర్సీస్‌లో ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. తాజా సమాచారం అందే వరకు 3.6 మిలియన్ డాలర్లు అంటే రూ. 30 కోట్లకుపైగానే రాబట్టింది. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది. సలార్ ఓవర్సీస్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. థియేట్రికల్ రైట్స్ రూ. 75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  తొలి రోజే రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలివారంలోనే రూ. 80 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    Salaar Scenes : ఆ సీన్స్ అవసరమా? ‘సలార్’పై కామెంట్స్!

    Salaar Scenes : బాహుబలి తర్వాత బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు...

    Salaar Movie Cast : ‘సలార్’ క్యాస్టింగ్ గురించి.. అసలు విషయం తెలిసిందా!

    Salaar Movie Cast : ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు...