35.8 C
India
Monday, May 20, 2024
More

    Smart Phone : మీ స్మార్ట్ ఫోన్ సేఫేనా..రేడియేషన్ వ్యాల్యూ చూసుకోండి ఇలా..

    Date:

    smart phone
    smart phone radiation value

    Smart Phone : స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ఇది ప్రతీ ఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. బెడ్ మీద నుంచి లేచింది మొదలు..రాత్రి నిద్రపోయే దాక అనుక్షణం మన చేతి వేళ్లకు పనిచెప్పే ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ ఫోనే. అర్ధరాత్రి దాక సెల్ లో చాటింగో, సినిమాలో చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాం. అలా మన జీవితంలో అత్యంత కీలకమైన వస్తువు అయిపోయింది. ఒక్క రకంగా చెప్పాలంటే రాక్షసుడి ప్రాణాలు సప్తసముద్రాల ఆవల ఓ చెట్టుతొర్రలోని పిట్టలో ఉన్నట్టు ప్రతీ మనిషి చిట్టా అంతా సెల్ ఫోన్ లోనే ఉంటుందంటే ఆశ్చర్యమేమీ లేదు.

    సెల్ ఫోన్ ను మనం విరివిగా ఉపయోగిస్తుంటాం. కాల్స్, చాటింగ్, సోషల్ మీడియా, సినిమాలు, క్రికెట్..ఇలా అనంతమైన ఆనందాలు, అవసరాలు సెల్ ద్వారానే సాగిపోతున్నాయి. అయితే సెల్ ఫోన్ వాడడంలోనే ధ్యాస ఉంటుంది తప్పా.. అది ఎంత రేడియేషన్ వదలుతుంది.. అది మనకు ఎంత హానిని కలుగజేస్తుందో చూడనే చూడరు. అతిగా చేస్తే అనర్థదాయకమే అని మన పెద్దలు చెప్పేవారు. సెల్ ఫోన్ అధికంగా వాడినా నష్టాలు ఉన్నాయి. మన ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు సైతం చెపుతుంటారు. అంతేకాదు గంటల తరబడి ఫోన్లో మాట్లాడితే రేడియేషన్ ప్రభావంతో మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని డాక్లర్లు, నిపుణులు సూచిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ కొనేటప్పుడు రేడియేషన్ లెవల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు చదవండి మరి..

    ఎస్ఏఆర్(స్పెసిఫిక్ అబ్జర్వేషన్ రేట్)  వ్యాల్యూ అనేది 16/కేజీ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఎస్ఆర్ వ్యాల్యూ 1.2 లేదా 0.5 నుంచి 0.6 పరిధిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మొబైల్ డివైజ్ వాడకాన్ని తగ్గించాలనుకుంటే మొబైల్ ఇయర్ ఫోన్లను ఉపయోగించుకుని రేడియేషన్ ప్రభావం తగ్గించుకోవచ్చు.

    ఇక ఎస్ఏఆర్ వ్యాల్యూ ను ఇలా చెక్ చేసుకోండి.. మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్ చేసి డయలర్ ను ఓపెన్ చేయండి. డయలర్ లో *#07# అనే కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ యొక్క ఎస్ఏఆర్ రేటింగ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. వ్యాల్యూ 1.6 దాటితే మాత్రం ఆ ఫోన్ అన్ సేఫ్ అని నిర్ధారించుకోవాలి.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lost your Phone : మీ ఫోన్ పోయిందా..అయితే ఇలా చేయండి..

    Lost your Phone : మొబైల్ ఫోన్ పోయినవారు పోలీస్ స్టేషన్లో చుట్టూ...

    Books give Good life : పుస్తకాలు బతుకునిచ్చాయి.. సెల్ ఫోన్ బతుకు బజారున పడేస్తోంది..

    Books give good life : ‘చిరిగిన చొక్క అయినా తొడుక్కో...

    Trigger Finger : మొబైల్ వాడకం వల్ల వచ్చే కొత్త రోగం ట్రిగ్గర్ ఫింగర్

    Trigger Finger : ఇటీవల కాలంలో మొబైళ్లు వాడే వారి సంఖ్య...

    Phone Check : ఉదయాన్నే ఫోన్ చూసేవారికి ఇది షాకింగ్ న్యూస్

    Phone Check : మనలో చాలా మంది ఉదయం లేవగానే ఫోన్లు...