39 C
India
Sunday, May 19, 2024
More

    Kerala Public Services : కేరళను చూసి నేర్చుకోండయ్యా.. పాలకులారా!

    Date:

    Kerala Public Services
    Kerala Public Services

    Kerala Public Services : తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులు, నైపుణ్యత ఉన్న విద్యార్థుల సంఖ్య  ఎక్కువే. అందుకే సాఫ్ట్ వేర్ రంగంలోనూ, మిగతా రంగాల్లోనూ మనవాళ్లు సత్తా చాటుతున్నారు. దానికి సత్య నాదేళ్లనే నిదర్శనం. జేఈఈ, నీట్, సివిల్స్ వంటి జాతీయ పరీక్షల్లో మనవాళ్లు ప్రతీ ఏడాది టాప్-5లో ఉంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు విద్యాసంబంధిత విషయాల్లో అవేర్ నెస్ ఎక్కువే. కాకపోతే మన ఉద్యోగార్థులు మాత్రం గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ డిపార్ట్ మెంట్ వంటి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకే ప్రిపేర్ అవుతుంటారు. సివిల్స్ బాగానే రాస్తారు కానీ మిగతా కేంద్రస్థాయి బోర్డులు భర్తీ చేసే రైల్వే, బ్యాంకు, ఎస్ఎస్ సీ వంటి ఉద్యోగాల వైపు దృష్టి సారించరు. అయితే దానికీ ఓ కారణముంది. గతంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే ఆ పరీక్షలు నిర్వహించేవారు. అప్పట్లో మనవాళ్ల అందరిదీ తెలుగు మీడియమే. కానీ ఉత్తరాది వాళ్లు ఇంగ్లీష్ రాకున్నా హిందీ భాషలో పరీక్షలు పెట్టడం వల్ల వారే ఉత్తీర్ణత సాధించేవారు.

    అలా మన సౌత్ వాళ్ల అవకాశాలను ఉత్తరాది వాళ్లు ఎగురేసుకుపోవడంతో మన నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు పెడుతున్నారు. ఈనేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు అటు కేంద్ర పోస్టులకు వెళ్లకుండా.. ఇక్కడి ప్రభుత్వాలు ఉద్యోగాలు వేయకుండా వారి జీవితాలతో ఆడుకున్నాయనే చెప్పాలి. నిరుద్యోగుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి కథే అయ్యింది. మన దగ్గర ఎన్నికల్లో లాభం పొందేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. ప్రతీ ఏడాది భర్తీ చేయాల్సిన పోస్టులను ఐదేండ్లకు ఒకసారి వేస్తారు. అందులో పారదర్శకత ఉండదు. అవినీతి, లీకేజీలు, పరీక్షల రద్దు..ఇలా ఒకటేమిటి సర్వ నాశనం చేస్తారు.

    ఇందులో టీఎస్సీపీఎస్సీతో పోలిస్తే ఏపీపీఎస్సీ కొంత మెరుగనే  చెప్పాలి. తెలంగాణలో ఒక జనరేషన్  భవిష్యత్ దెబ్బతింది. రాజకీయ నాయకులు ఒక టర్మ్ గెలవకుంటేనే  పతన స్థాయికి వెళతారు. అలాంటిది లక్షలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టి, నిద్రాహారాలు మాని నిజాయితీగా చదివితే..నోటిఫికేషన్లు వేయకుండా, వేసినా సమర్థవంతంగా నిర్వహించకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పాలి. అయితే ఉద్యోగాల భర్తీలో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోని ఇతర కమిషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. దాన్ని చూసి మన బోర్డులు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. కేరళ గొప్పతనం ఏంటో చూద్దాం..

    మన టీఎస్సీపీఎస్సీలో 127 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కేవలం 30 మంది మాత్రమే పరీక్షల నిర్వహణ చూస్తున్నారు. కనీసం 341 మంది అవసరమని గత ఐదేండ్ల కిందనే కమిషన్ అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయినా ఆ ప్రభుత్వం పట్టించుకోక గాలికి వదిలేసింది. మొన్నటి లీకేజీలతో తెలంగాణ ప్రతిష్ఠను గంగలో కలిపింది. మన దగ్గర పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కేరళ పీఎస్సీ బోర్డు విషయాలను పరిశీలిద్దాం. అక్కడ దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    మన తెలంగాణ కంటే జనాభాలోనూ, విస్తీర్ణంలోనూ కేరళ చిన్నది అయిన కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఇది దేశంలోనే భారీ సంఖ్య కావడం మరో విశేషం. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తారు. పదవీ విరమణలు కాగానే వెంటనే వాటిని భర్తీ చేస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తుంటారు. ఉపాధి కల్పన కేంద్రాలను రద్దు చేసి.. వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో విలీనం చేసి జిల్లా స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేసింది. కేరళ పీఎస్సీ పరిధిలో మూడు ప్రాంతీయ కమిషన్ కార్యాలయాలు ఉన్నాయి. 14 జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. పోలీస్, పాఠశాల మినహా అన్ని పోస్టులను పీఎస్సీ భర్తీ చేస్తుంది.

    ఇది కదా పాలకుల దార్శనికత.. ఇలా ఉండాలి. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన అనేది పాలకుల ఇండ్ల నుంచి ఇచ్చేది కాదు.. అది రాజ్యాంగం ప్రకారం కల్పించాల్సిన హక్కు. వాటిని తొక్కి పెట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటామంటే ప్రతిపక్షంలో కూర్చోక తప్పదు. ఉద్యోగాల భర్తీని రాజకీయాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీని చేసి కేరళ ఎలా ఆదర్శంగా నిలిచిందో చూడండి. అలా ఉండాలి పాలన అంటే.. మరి మనవాళ్లు ఇప్పటికైనా మారుతారో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పేప‌ర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు..అస‌లు టార్గెట్ ఏంటి..!?

    రాష్ట్రంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడుగా...

    కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

    తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు పీసీసీ...

    బండి సంజయ్ పై ట్వీట్ చేసిన కేటీఆర్

    పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక...

    TSPSC పేపర్ లీక్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీఏ శరత్ ?

    TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీఏ శరత్ పేరు...