37 C
India
Tuesday, May 7, 2024
More

    పేప‌ర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు..అస‌లు టార్గెట్ ఏంటి..!?

    Date:

    Breaking News: TSPSC Committee
    TSPSC

    రాష్ట్రంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడుగా వెళుతోంది. ఈకేసులో మ‌నీ లాండ‌రింగ్ ఏమైనా జ‌రిగిందా..? అక్ర‌మ లావాదేవీలు ఏమైనా జ‌రిగాయా..? అన్న కోణంలో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేసింది. కేసును సిట్ విచార‌ణ‌కు స్వీక‌రించిన త‌ర్వాత చాలా రోజుల‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ రంగం ప్ర‌వేశం చేసిన విష‌యం తెలిసింది. అయితే సీన్‌లోకి ఆల‌స్యంగా రంగ‌ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆ సంస్థకు సంబంధించిన అధికారులు చేస్తున్న ద‌ర్యాప్తు కాక రేపుతోంది.

    ఈడీ టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీపై ఈసీఐఆర్ ను రిజిస్ట‌ర్ చేసి మొద‌ట‌గా ఈకేసులో కీల‌క నిందితులుగా పేర్కొంటున్న రాజ‌శేఖ‌ర్ రెడ్డి,ప్ర‌వీణ్‌ల‌ను విచారించింది.  ఆ త‌ర్వాత సెక్ష‌న్ అధికారి శంక‌ర్ ల‌క్ష్మీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. ఈకేసులో పోలీసుల‌కు కంప్లైంట్ చేసిన అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్ స‌త్య‌నారాయ‌ణ వివ‌ర‌ణ కూడా తీసుకుంది. దీంతో వీరిద్ద‌రి స్టేట్‌మెంట్స్ ఆధారంగా కొన్నాళ్ల క్రితం ప్ర‌వీణ్‌,రాజ‌శేఖ‌ర్ రెడ్డిల‌ను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమ‌వారం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి,కార్యదర్శి అనితా రామచంద్రన్ సుదీర్ఘంగా విచారించారు.

    ఇక ఈడీ విచార‌ణ క్షేత్ర స్థాయి ఉద్యోగుల‌తో ముగుస్తుంద‌నుకుంటే..ఇప్పుడు టీఎస్పీఎస్పీ ఛైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి,కార్య‌ద‌ర్శి అనితారామ‌చంద్ర‌న్ వ‌ర‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అస‌లు ఈకేసులో ఈడీ ఇంత‌లా ఎందుకు దూకుడుగా ప్ర‌వ‌ర్థిస్తోంద‌నే అనుమానాలు క‌ల్గుతున్నాయి. కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నార్ధ‌న్ రెడ్డి,అనితా రామ‌చంద్ర‌న్ పాత్ర ఉన్న‌ట్లు సిట్ తేల్చ‌లేదు. వారి విష‌యంలో ప్రైమ‌ పైసీ ఉన్న‌ట్లు కూడా గుర్తించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ సిట్ వీరిని ఇవాళ సుదీర్ఘంగా విచారిస్తోంది.

    అయితే సిట్ దూకుడుగా వెళ్ల‌డానికి కూడా కార‌ణ‌ముంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో పెద్ద ఎత్తున డ‌బ్బులు చేతులు మారిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నందున..ఈ వ్య‌వ‌హారంలో రాష్ట్ర స‌ర్కార్ పెద్ద‌ల పాత్రేమైనా ఉందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. నేరుగా కార్య‌ద‌ర్శులు,ఛైర్మ‌న్‌ల‌ను విచారించ‌డం వ‌ల్ల పేప‌ర్ లీకేజీ కేసులో ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని ఈడీ అంచ‌నా వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే జ‌నార్ధ‌న్ రెడ్డి,అనితారామ‌చంద్ర‌న్‌ను ఎంక్వైయిరీ చేసిన త‌ర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కీల‌క చ‌ర్య‌లు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయ‌నే డిస్క‌ష‌న్ సాగుతోంది. చూడాలి మ‌రీ..ఈడీ చేసిన ద‌ర్యాప్తు ఎంత వ‌ర‌కు వ‌స్తుంద‌నేది.

    Share post:

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kerala Public Services : కేరళను చూసి నేర్చుకోండయ్యా.. పాలకులారా!

    Kerala Public Services : తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులు, నైపుణ్యత ఉన్న...

    KTR About TSPSC : ఎన్నికల వేల తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. టీఎస్‌పీఎస్‌సీ గురించి ఏమన్నారంటే?

    KTR About TSPSC : ఎన్నికలు సమీపించడమో.. లేక ఓటమి భయమో...

    మ‌నీని రాబ‌ట్టుకోవ‌డ‌మే మ‌స్క్ అస‌లు టార్గెట్ అంటా..!

    మ‌స్క్ ట్విట్ట‌ర్ ఓన‌రైన త‌ర్వాత దాన్ని ఒక ప‌ట్టాన ఉండ‌నివ్వ‌డం లేదు....

    కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

    తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చాడు పీసీసీ...