36.9 C
India
Tuesday, April 21, 2026
More

    మ‌నీని రాబ‌ట్టుకోవ‌డ‌మే మ‌స్క్ అస‌లు టార్గెట్ అంటా..!

    Date:

    Twitter employees gives shock to elon musk
    Elon musk

    మ‌స్క్ ట్విట్ట‌ర్ ఓన‌రైన త‌ర్వాత దాన్ని ఒక ప‌ట్టాన ఉండ‌నివ్వ‌డం లేదు. ఎప్పుడు ట్విట్ట‌ర్‌లో మార్పులు, చేర్పులు చేస్తున్నానంటూ..ఏదో ఒకటి గెలికి పారేస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు బ్లూ టిక్ పంచాయితీని న‌డిపించారు. వీఐపీలైన స‌రే పుక్కెడుకు బ్లూ టికెట్ వాడుకునేదే లేద‌ని తేల్చి చెప్పారు. బ్లూ టిక్ కావాలంటే రొక్కం చెల్లించాల్సిందేన‌ని తెగేసి చెప్పారు. మ‌స్క్ పోరు భ‌రించ‌లేక కొంత వీఐపీలు ట్విట్ట‌ర్ ఖాతాల‌ను కూడా క్లోజ్ చేసుకున్నారు.

    ఇక ఇంత‌టితో ఆగ‌ని మ‌స్క్‌..కొన్ని రోజుల పాటు ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌పై ప‌డ్డారు. ఆఫీస్ ప‌నివేళ‌ల‌ను స‌రిగ్గా పాటించ‌ని ఎంప్లాయిస్ జీతాల్లో కోత త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. కొంత మంది ఉద్యోగుల‌ను సంస్థ నుంచి తొల‌గించారు కూడా. దీంతో మ‌స్క్ శాడిజంపై ప‌లువురు ఎంప్లాయిస్ తిట్టిపోశారు. ఇదేం తిక్క ప‌నులంటూ మండిప‌డ్డారు.

    మ‌రోవైపు ఈ సంఘ‌ట‌న‌లు మ‌ర‌వ‌క ముందే తెర‌పైకి మ‌రో అంశాన్ని తీసుకువ‌చ్చారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌తీ ఏటా రూ.8.2 కోట్ల సంపాద‌న‌నే టార్గెట్‌గా పెట్టుకున్నారు. యూజ‌ర్లు ట్విట్ట‌ర్‌ను ఉప‌యోగించు కొని డ‌బ్బులు సంపాదించుకునే అవ‌కాశాన్ని కూడా క‌ల్పిస్తున్నారు. ఈ విష‌యంలో యూజ‌ర్లు త‌మ‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తార‌ని ఆశీస్తున్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేశారు. వెర‌సి ట్విట్ట‌ర్ ద్వారా మ‌నీని రాబ‌ట్టుకోవ‌డ‌మే మ‌స్క్ మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. మొత్తంగా ధ‌నం జ‌గ‌త్ ఇదం మూలం అన్న సూక్తిని మ‌స్క్ బాగానే వంట‌ప‌ట్టించుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trump : అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్.. వైదొలిగిన మస్క్

    Trump : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గట్టి షాకిచ్చారు....

    Robots : రోబోలే ఇక కటింగులు చేస్తాయి.. భవిష్యత్ ఆవిష్కరించిన ఎలన్ మస్క్

    Robots : తాజాగా ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ సృష్టికర్త ఎలన్ మస్క్ ఒక...

    Elon Musk : ఎలోన్ మస్క్ MSNBC కొనబోతున్నాడా..?

    Elon Musk : ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ న్యూచ్...

    Musk : అంబానీని ఆ విషయంపై ప్రశ్నిస్తానన్న మస్క్..

    Elon Musk : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్‌ను...