34.1 C
India
Saturday, May 18, 2024
More

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Date:

    Credit Cards
    Credit Cards

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి. చాలా మందికి క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. వారి అవసరం మేరకు కార్డులు జారీ చేస్తున్నాయి. వీటి మూలంగా ప్రతీ రోజు లక్షల్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అయితే, బిల్లుల చెల్లింపుల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాడుకున్నంత మేర క్రెడిట్ కార్డు బిల్లులను ఒకేసారి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని సార్లు డబ్బు లేక మినిమమ్ అమౌంట్ ఆప్షన్ ఎంచుకుంటాం. మినిమమ్ అమౌంట్ అనేది ఆ సమయం వరకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు. కానీ, అది మరింత భారం పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మినిమమ్ పేమెంట్ ద్వారా ఎలా నష్టపోతామో ఇక్కడ పరిశీలిద్దాం.

    క్రిడిట్ కార్డులతో ఏదైనా లావాదేవీలు జరిపితే.. బ్యాంకు నిర్ధేశించిన సమయంలోగా చెల్లిస్తే ఎలాంటి అదనపు భారం ఉండదు. సమయం దాటితే భారీగా చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ రేట్లు అధికం అవుతాయి. చేతిలో డబ్బు లేనప్పుడు వడ్డీ భారం తగ్గించుకోవచ్చని మినిమమ్ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే, ఇది మీ బిల్లులోని కనీస మొత్తం కాదని గుర్తుంచుకోవాలి. మీరు చెల్లించే మినిమమ్ పేను బ్యాంకులు వడ్డీ గానే చూస్తాయి. అంతే తర్వాతి నెల మళ్లీ చెల్లించాల్సిన సమయంలో ఆ బిల్లు కట్టాల్సిందే. అత్యవసరం సమయం నెల లేదంటే రెండు నెలలు సర్దుబాటుకు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ, ప్రతిసారీ ఇదే కొనసాగితే ఆర్థిక భారం తప్పదు. బకాయిల్లో వడ్డీ, రుసుముల వంటివన్నీ ఉంటాయి.

    బిల్లులో కనీస మొత్తం (మినిమమ్) చెల్లింపుతో తాత్కాలికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ, ఇది దీర్ఘకాలికంగా నష్టాలకు గురి చేస్తుంది. దీని ద్వారా వడ్డీ భారం ఎక్కువవుతుంది. క్రెడిట్ కార్డు అంటేనే అధిక వడ్డీ భారం ఉంటుంది. కొన్ని బ్యాంకులు, కార్డు సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై 36 నుంచి 48 శాతం వరకూ వడ్డీ వేస్తాయి. మినిమమ్ చెల్లిస్తుంటే.. ఎప్పటికీ ఆప్పు తీరదు. వడ్డీ, రుసుములు ఇలా ఒకదానికి ఒకటి జత అవుతాయి. పూర్తిగా అప్పుల ఊబిలోకి వెళ్లే ఆస్కారం ఉంది. ఈ అప్పు దీర్ఘకాలిక భారంగా ఉంటుంది.

    ఎప్పుడూ కార్డు పరిమితిలో 30 శాతంకు మించి వాడకపోవడమే మంచిది. బిల్లు మొత్తం చెల్లించకుంటే.. కార్డు వ్యయ నిష్పత్తి గరిష్ఠ స్థాయిలోనే ఉంటుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. బిల్లు చెల్లింపు పూర్తి కాకపోతే ఆలస్య రుసుములు, వడ్డీల భారంతో పాటు క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్ద మొత్తం ఉన్నప్పుడు ఈఎంఐలోకి మార్చుకునే అవకాశం ఉందా? చూసుకోవాలి. దీనిపై 14 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suicide : క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక భార్య భర్తలు ఆత్మహత్య

    Suicide : మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో...

    Credit Card : క్రెడిట్ కార్డు ఖాతాదారుడు చనిపోతే బీమా వస్తుంది తెలుసా?

    Credit Card : మనం ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్...

    Not Required to pay GST : మనం జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలుసా?

    Not Required to pay GST : ఈ రోజుల్లో అందరు...